ETV Bharat / city

పార్టీలోనే ఉంటా, రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న మహేశ్వర్‌రెడ్డి - రాజీనామా వార్తల్ని ఖండించిన మహేశ్వర్​రెడ్డి

Maheshwar Reddy denied resignation news అధిష్ఠానానికి మాణికం ఠాగూర్‌పై లేఖ, రాజీనామా చేస్తున్నానంటూ వస్తున్న వార్తల్ని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఖండించారు. చావో రేవో కాంగ్రెస్‌లోనేనని, ఐక్యంగా పార్టీ విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మాణికం ఠాగూర్ తనకు మంచి మిత్రుడని అతనితో తనకెలాంటి వివాదాలు లేవని మహేశ్వర్​రెడ్డి స్పష్టం చేశారు.

Maheshwarreddy
Maheshwarreddy
author img

By

Published : Aug 18, 2022, 7:29 PM IST

Maheshwar Reddy denied resignation news కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు నిన్నటి నుంచి మీడియాలో తనపై కథనాలు రావడం బాధ కలిగించిందని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తా అని ఎక్కడా చెప్పలేదు కానీ రాజీనామా చేస్తున్నట్టు మీడియాలో వచ్చిందని పేర్కొన్నారు. వెంటనే ఆ వార్తను ఖండించానన్నారు. కాంగ్రెస్‌లోనే ఉంటానని బహిరంగంగా ప్రకటించా.. రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. అలాంటి అవకాశం రాదన్నారు.

మళ్లీ ఈరోజు కూడా ఏఐసీసీకి లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి.. తాను ఎప్పుడూ ఎవరిపై కంప్లైంట్‌ చేయలేదని మహేశ్వర్​రెడ్డి అన్నారు. ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్‌గా మాట్లాడే వ్యక్తిని.. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి పార్టీ కోసం శాయశక్తులా కష్టపడుతున్నానని పేర్కొన్నారు. నిర్మల్‌లో రాహుల్‌గాంధీ పాదయాత్ర, ప్రజా చైతన్యయాత్ర, ఆదిలాబాద్‌లో మీటింగ్‌.. ఇలా ఎన్నో పెద్ద కార్యక్రమాలు చేశానన్నారు. మిస్‌ కమ్యూనికేషన్‌తో తప్పుడు సమాచారం వెళ్లిందని.. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌ తనకు మంచి మిత్రుడని తెలిపారు. ఆయనతో ఎలాంటి విభేదాల్లేవని తనకు కాంగ్రెస్‌ గౌరవం ఇచ్చిందని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటారని పేర్కొన్నారు. సీనియర్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారని, ఆయన లేవనెత్తిన అంశాలు అధిష్ఠానం పరిష్కరిస్తుందని మహేశ్వర్‌రెడ్డి వివరించారు.

'నేను కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తా అని చెప్పలేదు. నా రాజీనామా వార్తలు బాధకలిగించాయి. కాంగ్రెస్‌లోనే ఉంటానని బహిరంగంగా ప్రకటించా. ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్‌గా మాట్లాడే వ్యక్తిని. రాజీనామా చేసే ప్రసక్తి లేదు.. అలాంటి అవకాశం రాదు. మర్రి శశిధర్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటారు. మాణికం ఠాగూర్ నాకు మంచి మిత్రుడు. మాణికం ఠాగూర్‌కు నాకు ఎలాంటి విభేదాలు లేవు. నాకు కాంగ్రెస్ మంచి గౌరవం ఇచ్చింది.'-మహేశ్వర్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్

పార్టీలోనే ఉంటా, రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న మహేశ్వర్‌రెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.