ETV Bharat / city

బాధితులను పరామర్శించడం ప్రతిపక్షాల బాధ్యత: దాసోజు - కాంగ్రెస్ నేతల అరెస్టును ఖండించిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ కుమార్

శ్రీశైలంలో అగ్ని ప్రమాద మృతు కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ నేతల అరెస్టు సరికాదని... ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు మండిపడ్డారు. బాధితులను పరామర్శించడం ప్రతిపక్షాల బాధ్యత కాబట్టి... అనుమతి ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

aicc official spokes person dasoju sravan protest revanth reddy arrest
బాధితులను పరామర్శిచడం ప్రతిపక్షాల బాధ్యత: దాసోజు
author img

By

Published : Aug 22, 2020, 7:55 PM IST

Updated : Aug 22, 2020, 8:02 PM IST

శ్రీశైలంలో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవిని పోలీసులు అరెస్టు చేయడాన్ని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ ఖండించారు. దీనికి సంబంధించి డీజీపీని కలిసేందుకు వెళ్లిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్​ను హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేయడం సరైంది కాదని ఆరోపించారు.

ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను పరామర్శించడం ప్రతిపక్షాల నైతిక బాధ్యత దాసోజు శ్రవణ్​ గుర్తు చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడిపిస్తూ... ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ప్రమాద స్థలాన్ని సందర్శించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Last Updated : Aug 22, 2020, 8:02 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.