ETV Bharat / city

'రైతుబంధు' సమాచార చట్టం పరిధిలోకి రాదా?

రైతు బంధు వివరాలపై హైదరాబాద్​కు చెందిన ఓ వ్యక్తి సహ చట్టం కింద దరఖాస్తు చేశారు. మొత్తం 15 ప్రశ్నలకు సమాచారం అడిగితే చాలావాటికి ఇవ్వడం కుదరదని వ్యవసాయశాఖ తెలిపింది. కొన్నింటికి మాత్రం అసమగ్రంగా సమాచారం ఇచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎంత సొమ్ము పొందారనే వివరాలు కూడా ఇవ్వడం కుదరదని పేర్కొంది.

raithu bandhu
raithu bandhu
author img

By

Published : Jun 10, 2020, 7:41 AM IST

రైతుబంధు పథకంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎంత సొమ్ము పొందారనే వివరాలు సమాచార హక్కు చట్టం కింద ఇవ్వడం కుదరదని వ్యవసాయశాఖ స్పష్టం చేసింది. కమతాల విస్తీర్ణం వారీగా రైతుల వివరాలు ఇవ్వడానికి కూడా తిరస్కరించింది. ఈ వివరాల కోసం హైదరాబాద్‌కు చెందిన జలగం సుధీర్‌ అనే వ్యక్తి సహ చట్టం కింద వ్యవసాయశాఖ ‘ప్రజా సమాచార అధికారికి దరఖాస్తు చేశారు. మొత్తం 15 ప్రశ్నలకు సమాచారం అడిగితే చాలావాటికి ఇవ్వడం కుదరదని చెప్పి కొన్నింటికి మాత్రం అదీ అసమగ్రంగా ఇచ్చింది.

ఇవి అడిగినవి

ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి కుటుంబ సభ్యుల్లో ఈ పథకం కింద ఎంత సొమ్ము అందింది, వారి భూముల వివరాలేంటి? వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లలో ఎవరికి ఇచ్చారు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నవారికి ఎందరికిచ్చారు, కంపెనీల పేరుతో ఉన్న భూములకు ఎంత ఇచ్చారు, వాటి పేర్లేమిటి? 5 ఎకరాలకన్నా ఎక్కువ ఉన్న రైతులెందరు, 10, 20, 50, 100 ఎకరాలకన్నా ఎక్కువ భూమి ఉన్నవారెందరు ఈ సొమ్ము తీసుకున్నారనే వివరాలను అడగ్గా వాటిని ఇవ్వడానికి వ్యవసాయశాఖ నిరాకరించింది.

వారంతా అర్హులే

ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఎందరు సొమ్ము తీసుకున్నారనే ప్రశ్నకు మాత్రమే కేవలం గత యాసంగి (రబీ)లో సొమ్ము పొందినవారి వివరాలు అందజేసింది. జనరల్‌ కేటగిరీలో 31.31 లక్షలమందికి, ఎస్సీల్లో 5.94 లక్షలు, ఎస్టీల్లో 5.17 లక్షలమందికి సొమ్ము ఇచ్చినట్లు తెలిపింది. రాష్ట్రంలో ఉన్న పట్టాదారు పాసుపుస్తకం ఉన్న భూయజమానులంతా ఈ పథకానికి అర్హులని తెలిపింది.

ఇదీ చదవండి: రైతుబంధు దరఖాస్తులకు 13 వరకు అవకాశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.