దిల్లీలో జరుగుతున్న భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి 91వ వార్షిక సమావేశంలో... తెలంగాణలో ఏర్పాటైన నూతన జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. వ్యవసాయరంగంలో యాంత్రీకరణ అత్యవసరమవుతున్న ఈ సమయంలో... ఐసీఏఆర్ వ్యవసాయ పరికరాలపై ఎక్కువ దృష్టి సారించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్, పురుషోత్తం రూపాల, కైలాష్ చౌదరి, ప్రతాప్ చంద్ర సారంగి, రావు ఇంద్రజిత్ పాల్గొన్నారు.
కేంద్రం ఇప్పటి వరకు 52 వేల మెట్రిక్ టన్నుల కందిని మద్ధతు ధరకు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. మరో 50 వేల మెట్రిక్ టన్నుల కందిని కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: మిడతలతో యుద్ధం కోసం పాక్‌కు చైనా 'బాతుల సైన్యం'