ETV Bharat / city

యూరియా కొరతపై ప్రతిపక్షాల రాద్దాంతం సరికాదు: మంత్రి నిరంజన్ రెడ్డి - agriculter ministerreview on urea shortage

రాష్ట్రంలో యూరియా కొరతపై విపక్షాలు రాద్ధాతం చేస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసి... గతం కన్నా సాగు పెరగడం వల్ల యూరియాకు డిమాండ్‌ పెరిగినట్లు ఆయన వివరించారు.

యూరియా కొరత ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రమే
author img

By

Published : Sep 14, 2019, 10:35 AM IST

యూరియా కొరత ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రమే
యూరియా కొరత ప్రతిపక్షాల ఆరోపణలు మాత్రమే

రాష్ట్రంలో యూరియా కొరతపై విపక్షాలది పూర్తిగా అసత్య ప్రచారం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఎక్కడా కూడా యూరియా కొరత లేదని... క్షేత్రస్థాయిలో నాలుగు జిల్లాల్లో ఆయన పరిశీలించినట్లు తెలిపారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఆధార్ కార్డు, వేలిముద్ర విధానంతో క్యూలో రైతులు నిలబడాల్సి వస్తుందన్నారు. రాష్ట్రమంతా ఒకేసారి వచ్చిన వర్షాలతో... గతం కన్నా సాగు పెరిగి యూరియాకు డిమాండ్ పెరిగిందని మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

త్వరగా రవాణా...

చరిత్రలో తొలిసారి రోజుకు సగటున 12 వేల టన్నుల యూరియా తరలిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నెల 1 నుంచి శుక్రవారం వరకు లక్షా 28 వేల 277 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అవుతోందన్నారు. గుజరాత్ క్రిబ్‌కో హజీరా ప్లాంట్ నుంచి 6 వేల టన్నులు 36 గంటల్లోనే రవాణా చేసినట్లు తెలిపారు. గతంలో మూడు రోజుల సమయం పట్టేదన్నారు. ఆంధ్రప్రదేశ్ పోర్టుల నుంచి 48 గంటల సమయం పట్టగా... నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో 24 గంటల లోపు రేక్ పాయింట్లకు యూరియా చేరుకుంటుందని తెలిపారు.

రోడ్డు మార్గంలో రికార్డు...

రోడ్డు మార్గంలో రికార్డు స్థాయిలో 4 రోజుల్లో 5700 టన్నులు తరలించినట్లు వెల్లడించారు. యూరియా రవాణాలో తెలంగాణ ప్రభుత్వ రికార్డు సాధించిందని ఘనంగా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో తన పర్యవేక్షణలో రైల్వే, పోర్టు, రవాణా అధికారులు కదిలారని అన్నారు. మరో 18వేల 200 మెట్రిక్ టన్నుల యూరియా వివిధ పోర్టుల నుంచి లోడింగ్‌కు సిద్ధంగా ఉన్నదని... ఈ నెల 15 వరకు రాష్ట్రంలో కేటాయించిన వివిధ రేక్ పాయింట్లకు చేరుకుంటుందని ప్రకటించారు.

అధిక ధరలపై కొరడా...

రాష్ట్రంలోని 31 జిల్లాలలో సగటున 700 మెట్రిక్ టన్నుల యూరియా ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు నిరంజన్‌ రెడ్డి తెలిపారు. గతేడాది వానాకాలం సీజన్‌లో 6 లక్షల 72 వేల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరిగిందని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకే 7లక్షల 36 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు స్పష్టం చేశారు. యూరియా సరఫరాలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు. అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యసు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీ చూడండి : కాంగ్రెస్​ యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ ఏర్పాటు

13-09-2019 TG_HYD_51_13_MINISTER_ON_UREA_SHORTAGE_NIL_AV_3038200 REPORTER : MALLIK.B Note : file vis and grfx ( ) రాష్ట్రంలో యూరియా కొరతపై విపక్షాలది పూర్తిగా అసత్య ప్రచారం అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఎక్కడా కూడా యూరియా కొరత లేదని... క్షేత్రస్థాయిలో నాలుగు జిల్లాల్లో తాను పర్యటించి పరిశీలించినట్లు తెలిపారు. కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఆధార్ కార్డు, వేలిముద్ర విధానంతో క్యూలో రైతులు నిలబడాల్సి వస్తుందని... రాష్ట్రమంతా ఒకేసారి వర్షాలు కురియడం, గతం కన్నా ఈ ఏడాది సాగు పెరగడం మూలంగా యూరియా డిమాండ్ పెరిగిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. చరిత్రలో తొలిసారి రోజుకు సగటున 12 వేల టన్నుల యూరియా తరలిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ నెల 1 నుండి ఇవాళ్టి వరకు 1,28,277 మెట్రిక్ టన్నుల సరఫరా అవుతోందని చెప్పారు. గుజరాత్ క్రిబ్ కో హజీరా ప్లాంట్ నుండి 36 గంటల్లో 6 వేల టన్నులు వచ్చిందని... గతంలో దీనికి మూడు రోజులు, ఆంధ్రప్రదేశ్ పోర్టుల నుండి గతంలో 48 గంటల సమయం పట్టేదని తెలిపారు. నిరంతర పర్యవేక్షణ, సమన్వయంతో 24 గంటల లోపు రేక్ పాయింట్లు యూరియా చేరుకుంటుందని... రోడ్డు మార్గంలో రికార్డు స్థాయిలో 4 రోజుల్లో 5700 టన్నులు తరలించినట్లు వెల్లడించారు. యూరియా రవాణాలో తెలంగాణ ప్రభుత్వ రికార్డు సాధించిందని ఘనంగా చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలతో తన పర్యవేక్షణలో రైల్వే, పోర్టు, రవాణా అధికారులు కదిలారని అన్నారు. మరో 18,200 మెట్రిక్ టన్నులు యూరియా వివిధ పోర్టుల నుండి లోడింగ్‌కు సిద్ధంగా ఉన్న దృష్ట్యా... ఈ నెల 15 వరకు రాష్ట్రంలో కేటాయించిన వివిధ రేక్ పాయింట్లకు చేరుకుంటుందని ప్రకటించారు. రాష్ట్రంలోని 31 జిల్లాలలో సగటున 700 మెట్రిక్ టన్నుల యూరియా ప్రస్తుతం అందుబాటులో ఉందని... గత ఏడాది మొత్తం వానాకాలం సీజన్‌లో 6.72 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం జరిగిందని స్పష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటి వరకే 7.36 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయడం జరిగిందని... విశాఖ పోర్టును సందర్శన సమయంలో యూరియా దిగుమతి, ఎగుమతులను పర్యవేక్షించి పోర్టు, రైల్వే అధికారులతో చర్చించిన సమయంలో అవసరమైతే... మూడు షిఫ్టుల్లో పనిచేస్తామని విశాఖ పోర్టు కార్మికులు చెప్పడం సంతోషం అనిపించిందని మంత్రి చెప్పారు. సహకరిస్తున్న రైల్వే, పోర్టు, రవాణా అధికారులు, కార్మికులకు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు. యూరియా సరఫరా, పంపిణీలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని, నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు. ఎక్కడ అధిక ధరలకు అమ్మినట్లు తెలిసినా కఠిన చర్యలు తీసుకోవాలని నిరంజన్‌రెడ్డి సూచించారు. VIS............

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.