వ్యవసాయ, మార్క్‌ఫెడ్, రైల్వే, ఎరువుల కంపెనీల ప్రతినిధులతో మంత్రి నిరంజన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. వానాకాలం సాగుకు కావాల్సిన ఎరువులపై ఆగ్రోస్ అధికారులు, హ్యాడ్లింగ్ ఏజెంట్లతో మంత్రి చర్చించారు. రేక్ పాయింట్ల మంజూరు కోసం రైల్వే అధికారులను మరోసారి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. రామగుండం ఎరువుల కర్మాగారం పూర్తికి ప్రభుత్వ సహకారం అందిస్తామని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.
వానాకాలం సాగుకు ఎరువుల కొరత ఉండొద్దన్న మంత్రి.. క్షేత్రస్థాయికి ఎరువుల నిల్వలు చేరాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రేక్ పాయింట్లలో 24 గంటలలో అన్‌లోడ్ అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఏప్రిల్ వాటా 35 వేల మెట్రిక్ టన్నులు, మే వాటా 1.6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వెంటనే తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నెలాఖరు వరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. లక్ష టన్నుల ఇతర ఎరువుల బఫర్ నిల్వలు అందుబాటులో ఉంచాలన్నారు.
ఇవీచూడండి: ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు: ఉత్తమ్