ETV Bharat / city

Navy Helicopter : నేవీ అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ జాతికి అంకితం - advanced light helicopter

Navy Helicopter : భారత నౌకాదళ వాయు కేంద్రం ‘ఐఎన్‌ఎస్‌ డేగా’లో సోమవారం అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ (ఏఎల్‌హెచ్‌-324)కు సంబంధించిన తొలి స్క్వాడ్రన్‌ను తూర్పు నౌకాదళాధిపతి, వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌దాస్‌ గుప్తా జాతికి అంకితం చేశారు. దీనిని అత్యవసర వైద్య సదుపాయానికి ఎయిర్‌ అంబులెన్సుగా వినియోగిస్తారు. కమాండర్‌గా ఎస్‌ఎస్‌ దాస్‌ సేవలు అందించనున్నారు.

NAVY HELICOPTER: నేవీ అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ జాతికి అంకితం

author img

By

Published : Jul 5, 2022, 9:19 AM IST

Navy Helicopter : భారత నౌకాదళ వాయు కేంద్రం ‘ఐఎన్‌ఎస్‌ డేగా’లో సోమవారం అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ (ఏఎల్‌హెచ్‌-324)కు సంబంధించిన తొలి స్క్వాడ్రన్‌ను తూర్పు నౌకాదళాధిపతి, వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్​దాస్‌ గుప్తా జాతికి అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్​లో గల విశాఖలోని ఈ కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ హెలికాప్టర్లను దేశీయంగా హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో రూపొందించారు. తూర్పు తీరంలో నిఘాకు, సహాయ చర్యలు చేపట్టేందుకు ఈ లోహ విహంగం ఉపయోగపడుతుంది. ఏఎల్‌హెచ్‌ తొలి స్క్వాడ్రన్‌కు ‘క్రెస్ట్రల్స్‌’ అని నామకరణం చేశారు. ‘చిట్టి డేగ’ అని దీని అర్థం. దీన్ని అత్యవసర వైద్య సదుపాయానికి ఎయిర్‌ అంబులెన్సుగా వినియోగిస్తారు. కమాండర్‌గా ఎస్‌ఎస్‌ దాస్‌ సేవలు అందించనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.