ఏపీ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టును అదానీ పోర్ట్స్ లిమిటెడ్ వంద శాతం వశం చేసుకుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. పోర్టులో 27 శాతం వాటా ఉన్న అదానీ పోర్ట్స్ లిమిటెడ్.. విశ్వసముద్ర హోల్డింగ్స్ నుంచి 25 శాతం వాటాను రూ. 2వేల 800 కోట్లకు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. మొత్తంగా కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం అదానీ పోర్ట్స్ చేతుల్లోకి మారినట్లైంది. గతేడాదే అదానీ పోర్ట్స్ లిమిటెడ్ కృష్ణపట్నం పోర్టులో 75 శాతం వాటా కొనుగోలు చేయగా ఏడాది తిరగకుండానే.. మిగతా 25శాతాన్ని కొనుగోలు చేసింది.
2020-21 ఆర్ధిక సంవత్సరంలో కృష్ణపట్నం పోర్టు విలువ 13 వేల 675 కోట్లకు పెరిగినట్టు అదానీ గ్రూప్ ప్రకటించింది. ప్రస్తుతం 64 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం కలిగి ఉందని.. 2025 నాటికి 500 మిలియన్ టన్నుల లక్ష్యం చేరుకుంటుందని తెలిపింది. దక్షిణ భారత్ ముఖద్వారంగా కృష్ణపట్నం ఓడరేవును మారుస్తామని ప్రకటించింది.
ఇదీ చూడండి: రేపు సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన