ETV Bharat / city

drugs case: కెల్విన్‌కు డబ్బు పంపారా? ఛాటింగ్‌ చేశారా?.. ఛార్మిని ప్రశ్నించిన ఈడీ - ముగిసిన చార్మి విచారణ

drugs case: కెల్విన్‌కు డబ్బు పంపారా? ఛాటింగ్‌ చేశారా?.. ఛార్మిని ప్రశ్నించిన ఈడీ

author img

By

Published : Sep 2, 2021, 6:33 PM IST

Updated : Sep 3, 2021, 6:04 AM IST

18:31 September 02

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఛార్మిని విచారించిన ఈడీ

ముగిసిన నటి చార్మి విచారణ.. 6 గంటలు సాగిన ప్రశ్నల వర్షం

  తెలుగు సినీ పరిశ్రమ మత్తుమందుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. గత నెల 31న సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ విచారణకు హాజరు కాగా.. గురువారం నటి ఛార్మి ఈడీ కార్యాలయానికి వచ్చారు. తన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌తో కలిసి వచ్చిన ఆమెను అధికారులు దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించారు. కార్యాలయంలోని మూడో అంతస్తులో ఈడీ సంయుక్త సంచాలకుడు అభిషేక్‌ గోయల్‌ నేతృత్వంలోని బృందం విచారించింది. తన రెండు బ్యాంకు ఖాతాల వివరాల్ని ఛార్మి అధికారులకు సమర్పించారు. వాటిలో తమకు అనుమానంగా కనిపించిన లావాదేవీల గురించి అధికారులు ప్రశ్నించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మాదకద్రవ్యాల సరఫరాదారు కెల్విన్‌తో గల సంబంధాల గురించి అధికారులు ఆరా తీశారు. మాదకద్రవ్యాల కొనుగోలు నిమిత్తం కెల్విన్‌కు డబ్బు ఇచ్చారా? అని ప్రశ్నించారు. కెల్విన్‌తో ఫోన్‌ సంభాషణలు, వాట్సప్‌ ఛాటింగ్‌ చేశారా? అని అడిగారు. ఆన్‌లైన్‌లో అతడి ఖాతాకు డబ్బు పంపించారా? అని ఆరా తీశారు. దాదా పేరుతో ఉన్న ఫోన్‌ నంబరుకు కాల్స్‌ చేశారా? అని ప్రశ్నించారు. అయితే కెల్విన్‌ గురించి తనకేమీ తెలియదని.. అతడితో తనెలాంటి లావాదేవీలు జరపలేదని ఛార్మి బదులిచ్చినట్లు తెలిసింది. దర్శకుడు పూరి జగన్నాథ్‌తో ఛార్మి వ్యాపార లావాదేవీలు కలిగి ఉండటంతో వాటి గురించీ ఆరా తీసినట్లు సమాచారం. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు ఆమెను పంపించివేశారు.

దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తా: ఛార్మి

 ‘ఈడీ అధికారులు సమన్లు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యా. అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చా. నన్ను అడిగిన అన్ని బ్యాంకు పత్రాలను సమర్పించా. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తా. ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తా. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అందుకే కేసు గురించి ఎక్కువ మాట్లాడను’ 

మత్తుమందుల కేసులో ఈడీ అధికారులు 12 మంది సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేశారు. అందులో భాగంగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఎన్​డీపీఎస్​ చట్టం కింద 2017లో నమోదు చేసిన కేసు దర్యాప్తు ఆధారంగా ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. ఈనెల 22 వరకు సంబంధించి విచారణ జరగనుంది.

ఇవీ చూడండి:

Last Updated : Sep 3, 2021, 6:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.