ETV Bharat / city

Samantha: 'కరోనా నా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది' - కరోనా సంక్షోభం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రకృతి పరిరక్షణ పేరుతో నిర్వహించిన చర్చాకార్యక్రమంలో సమంత పాల్గొన్నారు. కరోనా సంక్షోభం తన జీవితంలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందనే ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

actor Samantha akkineni participated in nature awareness program

author img

By

Published : Jun 5, 2021, 10:31 PM IST

కరోనా సంక్షోభం తన జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని సినీనటి సమంత అక్కినేని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఫిక్కీలో సదస్సు నిర్వహించారు. ఎఫ్ఎల్‌వో ఛైర్​పర్సన్​ ఉమ చిగురుపాటి ఆధ్వర్యంలో పర్యావరణ సమతుల్యతపై ప్రకృతి పరిరక్షణ పేరుతో నిర్వహించిన చర్చాకార్యక్రమంలో సమంత, నారాయణ్‌పేట కలెక్టర్ హరిచందన, సాగె ఫామ్ కేఫ్ చీఫ్ క్యూరేటర్ కవిత, అర్బన్ కిసాన్ సహా వ్యవస్థాపకులు డాక్టర్ సాయిరాం రెడ్డి పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకై ఎలాంటి కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలన్న అంశంపై సదస్సులో చర్చించారు.

కరోనా సంక్షోభంలో పర్యావరణహిత హైడ్రోప్రోనిక్స్​ను ఇంట్లోనే పెంచుకుంటూ ఆహారాన్ని తయారు చేసుకుంటున్నట్లు సమంత తెలిపారు. ఇంటికే పరిమితమవడం, ఆహార పదార్థాలను స్వయంగా తయారు చేసుకోవటం అలవాటైందన్నారు. కరోనా సమయంలో పూర్తిగా శాఖాహారిలా మారానన్న సమంత.. ప్రతిఒక్కరూ పర్యావరణ రక్షణకు శ్రీకారం చుట్టాలని కోరారు.

వ్యర్థాల రీసైక్లింగ్​తో కాలుష్యాన్ని తగ్గించి ప్రకృతికి దోహదపడేలా చర్యలు తీసుకుంటున్నామని నారాయణ్‌పేట కలెక్టర్ హరిచందన పేర్కొన్నారు. కరోనా వచ్చి పర్యావరణంపై మానవాళి నిర్లక్ష్యాన్ని గుర్తు చేసిందని అభిప్రాయపడ్డారు. పర్యావరణహితంగా ఆహారాన్ని పండించడం, తినడం ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమని ప్యానెలిస్టులు కవిత, డాక్టర్ సాయిరాంరెడ్డి సూచించారు.

ఇదీ చూడండి: Corona: గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు కరోనా సోకే అవకాశం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.