ఏపీ నెల్లూరు జిల్లా నల్లగొండ్లలోని నీలగిరి పర్వతాలపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో.. సినీనటి అనసూయ సందడి చేశారు. మహాశివరాత్రి వేడుకలకు.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆమె ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
దేవస్థానంలో నూతనంగా నిర్మించిన కల్యాణ మండపం, భక్తుల వసతి, అన్నదాన సముదాయాలను అనసూయ ప్రారంభించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అభిమానులతో కాసేపు ముచ్చటించారు.
ఇదీ చదవండి: 'భారత్ ఇక ప్రజాస్వామ్య దేశం కాదు'