ETV Bharat / city

Green India Challenge: రామోజీ ఫిలిం సిటీలో మొక్క నాటిన ఆది పినిశెట్టి - actor aadhi pinisetty news

రామోజీ ఫిలిం సిటీలో చేపట్టిన గ్రీన్​ ఇండియా కార్యక్రమానికి సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇటీవలే బాలీవుడ్​ సూపర్​స్టార్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​, టాలీవుడ్​ కింగ్​ నాగార్జున మొక్కలు నాటగా.. తాజాగా ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్నాడు.

actor aadhi pinisetty planted a plante in ramoji film city

author img

By

Published : Aug 1, 2021, 4:55 PM IST

గ్రీన్​ఇండియా ఛాలెంజ్​లో భాగంగా మొక్క నాటిన ఆది పినిశెట్టి

యువ కథానాయకుడు ఆది పిన్నిశెట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్నాడు. హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క నాటారు. రంగస్థలం సినిమాలో నటించిన తన సహచర నటుడు శత్రు విసిరిన సవాల్​ను ఆది స్వీకరించాడు. ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొన్న ఆది... విరామ సమయంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొని మొక్క నాటారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్​ను మొదలుపెట్టిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్​కు ఆది అభినందనలు తెలిపాడు. సామాజిక మాధ్యమాల్లో రకరకాల ఛాలెంజ్​లను స్వీకరించే యువత... బాధ్యతగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొనాలని సూచించారు. ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని ఆది కోరారు. బాలీవుడ్ కథానాయకుడు మిథున్ చక్రవరి, ఆకాంక్ష సింగ్, నిక్కీ గల్రానీ, రాహుల్ రవీంద్రకు ఈ గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ను ఆది విసిరాడు.

ఇటీవలే.. గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​ కార్యక్రమంలో బాలీవుడ్​ సూపర్​స్టార్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​, టాలీవుడ్​ కింగ్​ నాగార్జున మొక్కలు నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్​ కుమార్​ ప్రారంభించిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ఎనలేని స్పందన లభిస్తోంది.

ఇదీ చూడండి:

  • Green India Challenge : ఫిలింసిటీలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటిన బిగ్​బీ
  • ప్రకృతితో ఆరోగ్యం + ప్రతిరోజూ ఆహ్లాదం @ ప్లాంట్ బాక్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.