ETV Bharat / city

కరోనా వేళ ఆగిన తనిఖీలు.. పెరుగుతున్న ప్రమాదాలు - speed guns

హైదరాబాద్‌ - బీజాపూర్‌ అంతరాష్ట్ర దారిపై మళ్లీ ప్రమాదాలు పెరుగుతున్నాయి. వాహనదారుల అతివేగం, అజాగ్రత్తతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రధాన గేట్లు, మలుపుల వద్ద నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలపై ప్రత్యేక కథనం...

accidents increased on hyderabad-beejapur road
ఆగిన తనిఖీలు.. పెరుగుతున్న ప్రమాదాలు
author img

By

Published : Jul 1, 2020, 9:15 AM IST

కండ్లపల్లి సమీపంలో ప్రమాదకర మలుపు

పూడూరు మండలం మీదుగా హైదరాబాద్‌- బీజాపూర్‌ జాతీయ రహదారి వెళ్తుంది. వికారాబాద్‌, తాండూరు, పరిగి ప్రధాన రహదారి ఇదే. దీంతో మన్నెగూడ కూడలి మీదుగా నిత్యం వందల వాహనాలు ఇరువైపులా రాకపోకలు సాగిస్తుంటాయి. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ముంబయి హైవే నుంచి శంకర్‌పల్లి, చేవెళ్ల మీదుగా బెంగళూరు అంతరాష్ట్ర రహదారికి ఇది లింకు రోడ్డు కావడంతో రద్దీ అధికంగా ఉంటుంది. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి సిమెంట్‌, నాపరాయి పరిశ్రమలకు లారీలు, భారీ వాహనాలు ఈ రహదారి మీదుగానే వచ్చిపోతుంటాయి. ఆయా వాహనదారులు అతివేగంగా వెళ్తుండంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు గుర్తించిన పోలీసులు గతంలో తీసుకున్న చర్యలు కొంత ఫలితం ఇచ్చాయి. ప్రస్తుతం ఆయా చర్యలు అటకెక్కడంతో మళ్లీ ప్రమాదాలు పెరుగుతున్నాయి.

గతంలో స్పీడ్‌గన్‌తో పర్యవేక్షణ

గతంలో రహదారిపై అవసరమున్న చోట్ల వేగనిర్ధారణకు స్పీడ్‌గన్లను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడలిలో పోలీసులు నిత్యం వాహనాలు తనిఖీ చేసేవారు. మద్యం తాగి వాహనదాలు నడిపే వారిని గుర్తించి న్యాయస్థానానికి పంపించేవారు. ప్రధాన కూడలిలో నో పార్కింగ్‌ ప్రదేశాల్లో వాహనాలను రోడ్డుపై నిలిపి ఉంచటం, ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణం లేకపోవడం వంటివి గుర్తించి జరిమానా విధించే వారు. దీంతో నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదాలు తగ్గాయి. కేవలం 9 ప్రమాదాలు చోటుచేసుకోగా ఒక్కరు మాత్రమే మృతి చెందారు. 15 మంది గాయపడ్డారు.

లాక్‌ డౌన్‌ తర్వాత..

కరోనా వైరస్‌ కట్టడికి ప్రభుత్వం రెండు నెలల పాటు లాక్‌డౌన్‌ అమలు చేసింది. దీంతో పోలీసులు జనాలు గుంపులుగా చేరకుండా ప్రత్యేకంగా దృష్టిసారించారు. గ్రామాల్లో పర్యవేక్షించడంతో పాటు అంగడిచిట్టంపల్లిలోని ప్రధాన చెక్‌పోస్టువద్ద తనిఖీలు చేసేవారు. లాక్‌డౌన్‌ సడలింపు ప్రారంభంతో వాహనాల తనిఖీలు తగ్గించారు. ఇదే అదనుగా కొందరు వాహనదారులు నిబంధనలు పాటించడం లేదు. కొన్ని ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నా పట్టించుకోవడం లేదు. వాహనాలు మితిమీరిన వేగంతో నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.

ఇటీవల సోమన్‌గుర్తి సమీపంలో ప్రమాదం

ప్రమాదాల నివారణకు చర్యలు

- భీంకుమార్‌, ఎస్సై, చన్‌గోముల్‌

ప్రమాదాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. డ్రంకెన్‌ డ్రైవ్‌ మినహా, ఇతర తనిఖీలు ఎప్పటి మాదిరిగానే చేస్తున్నాం. కొందరు వాహనదారులు నిబంధనలు పాటించడం లేదు. ప్రస్తుతం కరోనా కట్టడి విధులపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నాం. ప్రమాదకరంగా మలుపులు ఉన్న ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నాం. వాహనదారులు సహకరించాలి. నిబంధనలు పాటించకపోతే కఠినంగా వ్యవహరిస్తాం.

కొన్ని సంఘటనలు ఇలా..

  • సోమన్‌గుర్తి గేటువద్ద ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో దానిపై ప్రయాణిస్తున్న దంపతులు కిందపడిపోయారు. ఎదురుగా వస్తున్న మరోకారు వారి మీద నుంచి దూసుకెళ్లింది. దీంతో భార్యభర్తలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
  • పరిగి నుంచి చేవెళ్లకు వెళ్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ దేవనోనిగూడ గేటువద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవటంతో తీవ్రంగా గాయపడ్డారు.
  • వారం కిందట మీర్జాపూర్‌ గేటువద్ద అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుపోయింది. కారు దెబ్బతింది. ప్రాణనష్టం జరగలేదు.
  • ఎన్కెపల్లి గేటువద్ద ద్విచక్రవాహనాన్ని వెనకవైపు నుంచి కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారు.

ఇవీ చూడండి: 92 శాతం మంది దీర్ఘకాలిక రోగులు మృత్యుంజయులే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.