ETV Bharat / city

'సంగం' సర్వర్లు తీసుకెళ్లేందుకు అనిశా యత్నం..అడ్డుకున్న ఉద్యోగులు

ఏపీలోని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, ఎండీ గోపాలకృష్ణన్‌కు బెయిలు ఇచ్చేందుకు అనిశా న్యాయస్థానం నిరాకరించింది. వారు దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్‌ను కొట్టివేసింది. అంతకు ముందు సంగం డెయిరీలో తనిఖీలు చేసిన అనిశా అధికారులు ఛైర్మన్‌ ఛాంబర్‌ను సీజ్‌ చేశారు.

sangam dairy
సంగం డెయిరీ
author img

By

Published : May 8, 2021, 8:49 AM IST

ఆంధ్రప్రదేశ్​లో గుంటూరు జిల్లా వడ్లమూడిలోని సంగం డెయిరీలో శుక్రవారం అనిశా అధికారులు తనిఖీలు నిర్వహించారు. డెయిరీ స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవోని హైకోర్టు కొట్టివేసినా... అవినీతి నిరోధక శాఖ అధికారులు డెయిరీ వద్దకు వెళ్లారు. సంస్థకు సంబంధించిన డేటా సర్వర్లను స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న ఉద్యోగులు...కోర్టు తీర్పు కాపీ రాకముందే సంస్థకు సంబంధించిన కీలక డేటా సర్వర్లను అధికారులు తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారంటూ ఆందోళన చేశారు. ఉద్యోగుల ఆందోళనతో వెనక్కి తగ్గిన అధికారులు... డెయిరీ ఛైర్మన్‌ ఛాంబర్‌ను సీజ్‌ చేసి వెళ్లిపోయారు.

సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, ఎండీ గోపాలకృష్ణన్‌కు బెయిలు ఇచ్చేందుకు విజయవాడలోని అనిశా న్యాయస్థానం నిరాకరించింది. వారు దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్‌లను విచారించిన న్యాయస్థానం... వాటిని కొట్టివేసింది. ఇదే కేసులో మూడో నిందితునిగా ఉన్న గురునాథంకు మాత్రం బెయిలు మంజూరు చేసింది.

అంతకుముందు ధూళిపాళ్ల నరేంద్ర క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సంగం డెయిరీపై ప్రభుత్వ పెత్తనం చెల్లదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. డెయిరీని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవోను హైకోర్టు నిలిపివేసింది.

ఇదీచదవండి: ఈటల గోదాములపై ఏసీబీ, విజిలెన్స్‌ విచారణ

For All Latest Updates

TAGGED:

sangam dairy
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.