ETV Bharat / city

ఏపీలో వరద నష్టంపై కొనసాగుతున్న కేంద్ర బృందాల పర్యటన - AP News

వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు ఏపీలో పర్యటిస్తున్నాయి. సచివాలయానికి చేరుకున్న బృందాల సభ్యులు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సహా సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు.

a-tour-of-central-teams-in-the-state-to-estimate-lost-due-to-heavy-rains
ఏపీలో వరద నష్టంపై కొనసాగుతున్న కేంద్ర బృందాల పర్యటన
author img

By

Published : Nov 9, 2020, 8:40 PM IST

ఇటీవల భారీ వర్షాలకు సంభవించిన నష్టాలపై అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు ఏపీకి చేరుకున్నాయి. వరదల కారణంగా జరిగిన నష్టం వివరాలను వివిధ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. నష్టంపై ఆయా శాఖల వారీగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్​ను బృందం పరిశీలించింది. దీనిపై కేంద్ర బృందానికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు.

వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టంపై కేంద్ర బృందానికి ఏపీ సీఎస్ నీలం సాహ్ని నివేదిక అందించారు. రూ.6,386.67 కోట్ల సాయం ఇవ్వాలని కేంద్ర బృందాలను ఏపీ ప్రభుత్వం కోరింది. తక్షణ సాయంగా రూ.840 కోట్లు విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వర్షాలకు వ్యవసాయ పంటల నష్టం రూ.903.96 కోట్లు, ఉద్యాన పంటల నష్టం రూ.483 కోట్ల వరకు ఉందని అంచనా వేసినట్లు చెప్పారు. మత్స్య, పశుసంవర్దక, పట్టు పరిశ్రమ రంగాలకు అపార నష్టం జరిగిందని, రహదారులు ఘోరంగా దెబ్బతిన్నాయని నివేదికలో తెలిపింది.

ఆర్​అండ్​బీ శాఖ పరిధిలో రూ.2,976.96 కోట్లు నష్టం వాటిల్లగా, పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో రూ.781.73 కోట్లు, పురపాలకశాఖ పరిధిలో అంచనా నష్టం రూ.75 కోట్లు ఉన్నట్లు నివేదికలో తెలిపారు. రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర హోంమంత్రికి సీఎం ఇప్పటికే లేఖ రాసినట్లు తెలిపారు. సమావేశం అనంతరం బృందాలుగా విడిపోయిన కేంద్ర బృందాలు అనంతపురం, గుంటూరు, కృష్ణా జిల్లాల క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లాయి.

  • కృష్ణాజిల్లాలో పర్యటన:

జిల్లాలో పర్యటిస్తున్న ముగ్గురు సభ్యుల కేంద్ర బృందం కలెక్టర్‌ ఇంతియాజ్‌ను క్యాంప్‌ ఆఫీస్‌లో కలిశారు. పంట నష్టానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. జిల్లాలో ఇప్పటి వరకూ 17వేల హెక్టార్ల అగ్రికల్చర్‌, 8వేల హెక్టార్ల హార్టికల్చర్‌ పంట నష్టానికి గురైనట్లు అంచనా వేశామని కేంద్ర బృందానికి జిల్లా పాలనాధికారి తెలిపారు. దీంతో పాటు రోడ్లు, ఫిషరీస్‌, యానిమల్‌ హస్బెండరీ, పట్టుపరిశ్రమ కూడా నష్టపోయిందని చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. ఈరోజు కంచికచెర్ల, చందర్లపాడు, మైలవరం మండలాల్లో బృందం పర్యటించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఐదేళ్లలో భాగ్యనగరానికి తెరాస చేసిందేమీ లేదు: బండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.