కరోనా కష్టకాలంలో ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ.. అందరి ఆదరాభిమానాలను పొందుతున్న నటుడు సోనూసూద్. ఆయన సేవలకు ముగ్ధుడైన ఓ విద్యార్థి భారీ చిత్రాన్ని అతితక్కువ సమయంలో గీశారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దాసరి యశ్వంత్ ఇటీవల చిత్రించిన 273 చదరపు మీటర్ల భారీ చిత్రం 12 ప్రపంచ రికార్డుల పుస్తకాల్లో నమోదయింది.
ఈ వివరాలతో హైదరాబాద్‌కు చెందిన భారతి ఆర్ట్స్ అకాడమీ ఏబీసీ సత్కరించటానికి ఆహ్వానం పలికాయి. బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమం ఇవాళ జరగనుంది.
ఇదీ చదవండి: వివాహ బంధానికి ఆమిర్ ఖాన్ దంపతుల గుడ్‌బై