కాలికట్‌లోని మలబార్ క్రిష్టియన్ కళాశాలలో హిస్టరీ లెక్చరర్ ప్రొఫెసర్ వశిష్ట్, అతని విద్యార్థి జాక్సన్ వర్గీస్ కలిసి జలియన్ వాలాబాగ్‌లో ప్రాణాలు కోల్పోయిన స్వాతంత్ర్య సమరయోధుల మీద పాటను తయారుచేశారు. ఈ పాటలో జాతీయ సమైక్యత చరిత్రను విశ్లేషించినట్లు చెప్పారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగానికి నివాళిగా ఈ పాటను వారికి అంకితమిస్తున్నట్లు ప్రొఫెసర్ తెలిపారు. ఈ పాటను వాణిజ్య ప్రయోజనం కోసం రూపొందించామని.. వశిష్ట్ తెలిపారు. తాను.. తన విద్యార్థి జాక్సన్ కలిసి.. పాట ప్రాచుర్యం పెంచేందుకు చూస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ పాట ద్వారా వచ్చిన ప్రతి రూపాయిని సామాజిక సేవ కోసం వాడనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 'ఐదు నెలల్లో కేరళ విమాన ప్రమాదంపై నివేదిక'