ETV Bharat / city

అమ్మ భారమైంది.. రైలెక్కించి వదిలేశారు.. ఆపై.. - విజయవాడలో తల్లిని వదిలిన కొడుకు

కని.. పెంచి.. పెద్ద చేసిన కొడుక్కి.. ఆమె అవసరం తీరిపోయింది. కోడలికి ఆమె భారమైంది. ఏదో ఓ రైలెక్కించి పంపేసి వదిలించుకున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌కు చేరుకు‌న్న ఆ వృద్ధురాలు.. యాచకురాలిగా మారింది. తిండీ తిప్పలు లేక అనారోగ్యం పాలై బస్టాండ్‌ ఆవరణలో పడి ఉన్న ఆమెను ఆర్టీసీ సిబ్బంది కాపాడారు. వివరాలు కనుక్కుని సొంత ఊరికి పంపే ఏర్పాట్లు చేశారు.

human angle story from andhra pradesh
బెజవాడ బస్డాండ్​లో ఓ వృద్ధురాలి దీనగాథ
author img

By

Published : Apr 23, 2021, 4:58 PM IST

బెజవాడ బస్టాండ్​లో బిక్కుబిక్కుమంటూ దీనంగా చూస్తున్న ఈ వృద్ధురాలిది ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పం. సొంతవాళ్లు వదిలించుకోవడంతో.. కొంతకాలంగా విజయవాడ బస్టాండే ఈమె ఆవాసమైంది. ప్రయాణికుల దయతో ఇచ్చే డబ్బుతోనే పొట్ట నింపుకుంటోంది. వయసు మీద పడి యాచించడమూ వీలుకాని స్థితిలో ఉన్న ఈ అవ్వ.. పిల్లలు పెట్టిన కష్టాలు తలచుకుని.. ఏడవని రోజంటూ లేదు. కొన్ని రోజుల క్రితం బస్టాండ్‌కు వచ్చిన వృద్ధురాలు.. తీవ్ర జ్వరంతో లేవలేని స్థితికి చేరుకుంది. సాయం చేయాలని.. కనిపించిన వారందరినీ కన్నీటితో వేడుకుంటోంది.

వృద్ధురాలి దీనస్థితిని చూసిన ఆర్టీసీ సిబ్బంది.. ఆమెకు మందులు తెప్పించి ఇచ్చారు. అల్పాహారం తినిపించి ఆకలి తీర్చారు. కాస్త నీరసం తగ్గాక.. గద్గద స్వరంతో ఆమె చెబుతున్న వివరాలు విని ఆవేదన చెందారు.

తనది చిత్తూరు జిల్లా కుప్పం అనీ.. కుమారుడిని కష్టపడి చదివించి వివాహం చేశానని ఆమె వివరించింది. తన పేరిట ఉన్న పొలాన్నీ వారికే ఇచ్చానని అవ్వ చెప్పింది. బాగా చూసుకుంటారని ఆశిస్తే.. ఇంట్లో నుంచి వెళ్లగొట్టారంటూ కన్నీటి పర్యంతమైంది. స్థానికంగా ఉంటే ఇబ్బందవుతుందన్న ఆలోచనతోనే ఇంత దూరం పంపేశారంటూ అవ్వ వాపోయింది.

వృద్ధురాలి కష్టాలు తెలుసుకున్న సిబ్బంది.. మూడురోజులుగా ఆమె ఆలనాపాలన చూస్తున్నారు. రెండు రోజుల క్రితం కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్న అవ్వ పరిస్థితి ప్రస్తుతం మెరుగైంది. తన ఊరికి వెళ్లి ఏదో విధంగా బతుకుతానని దీనంగా చెబుతోంది. కుమారుడి ఫోన్‌ నంబర్​ తెలికపోవడంతో.. వారికి సమాచారం ఇవ్వడం కుదరలేదు. ఆర్టీసీ సిబ్బందే సొంత ఖర్చుతో కుప్పం పంపే ఏర్పాట్లు చేశారు.

బెజవాడ బస్డాండ్​లో ఓ వృద్ధురాలి దీనగాథ

ఇవీచూడండి: ప్రజల ప్రాణాలు కాపాడటానికి కేసీఆర్ వెనకాడరు : మంత్రి ఈటల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.