ఏపీలో కరోనా వ్యాప్తి కొంచెం తగ్గింది. 24 గంటల వ్యవధిలో 6,235 మందికి కరోనా సోకింది. 51 మంది మరణించారు. మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 6,31,749కి చేరింది. 5,410 మంది చనిపోయారు. ప్రస్తుతం 74,518 యాక్టివ్ కేసులున్నాయి.
ఇప్పటివరకు 5,51,821 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంగా 51,60,700 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: 'కేంద్ర వ్యవసాయ బిల్లు.. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం'