ap corona cases today: ఏపీలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 19,241 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 335 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ సోకి కృష్ణా, చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా బారి నుంచి తాజాగా 936 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,754 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
-
#COVIDUpdates: 20/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,16,285 పాజిటివ్ కేసు లకు గాను
*22,94,818 మంది డిశ్చార్జ్ కాగా
*14,713 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6,754#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/dXNEzK7RHe
">#COVIDUpdates: 20/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 20, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,16,285 పాజిటివ్ కేసు లకు గాను
*22,94,818 మంది డిశ్చార్జ్ కాగా
*14,713 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6,754#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/dXNEzK7RHe#COVIDUpdates: 20/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 20, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,16,285 పాజిటివ్ కేసు లకు గాను
*22,94,818 మంది డిశ్చార్జ్ కాగా
*14,713 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6,754#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/dXNEzK7RHe
దేశంలోనూ తగ్గుముఖం..
India covid cases: మరోవైపు దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య 20 వేల లోపునకు పడిపోయింది. కొత్తగా 19,968 కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 673 మంది మరణించారు. 48,847 మంది కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 4,28,22,473
- మొత్తం మరణాలు: 5,11,903
- యాక్టివ్ కేసులు: 2,24,187
- మొత్తం కోలుకున్నవారు: 4,20,86,383
Vaccination in India: దేశంలో వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. శనివారం మరో 30,81,336 మందికి టీకాలు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ అయిన మొత్తం డోసుల సంఖ్య 1,75,37,22,697కు చేరింది.
World Covid cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఆందోళకరంగానే ఉంది. 24 గంటల వ్యవధిలో 15,90,061 కేసులు బయటపడ్డాయి. రష్యా, జర్మనీ, బ్రెజిల్, దక్షిణ కొరియా దేశాల్లో వైరస్ ఉద్ధృతి తీవ్రంగా ఉంది.
- రష్యాలో తాజాగా లక్షా 79 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 798 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య కోటి 51 లక్షలు దాటింది.
- జర్మనీలో 1.37 లక్షల కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 133 మంది కరోనాకు బలయ్యారు.
- బ్రెజిల్లో రోజువారీ కరోనా మరణాలు సంఖ్య భారీగా ఉంటోంది. 24 గంటల వ్యవధిలో 827 మంది చనిపోయారు. కొత్తగా లక్షా మూడు వేల కేసులు వెలుగుచూశాయి.
- దక్షిణ కొరియాలోనూ లక్షకు పైగా కొవిడ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. 71 మంది వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.
- జపాన్, టర్కీ, ఫ్రాన్స్, ఇండోనేసియా దేశాల్లోనూ వైరస్ విజృంభణ తీవ్రంగా కొనసాగుతోంది.
ఇదీ చదవండి : ప్రాంతీయ పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన సమయమిది: కేసీఆర్