ETV Bharat / city

VARIETY BAJJIS: జామకాయ బజ్జీ తిన్నారా.. యాపిల్‌ బజ్జీ రుచిచూశారా.. ? - latest food

ఇప్పటి వరకు మిర్చి, ఆలూ, అరటికాయ బజ్జీలు తినుంటారు.. కానీ జామకాయ బజ్జీ తిన్నారా.. యాపిల్‌ బజ్జీ రుచిచూశారా.. డ్రాగన్‌ఫ్రూట్‌, స్టార్‌ ఫ్రూట్‌తోనూ బజ్జీలు వేస్తారని తెలుసా. అలా సుమారు 25 రకాల బజ్జీలు ఏపీలోని రాజమహేంద్రవరం వాసులను అలరిస్తూ.. భోజన ప్రియుల జిహ్వ చాపల్యాన్ని తీరుస్తున్నాయి.

VARIETY BAJJIES
VARIETY BAJJIES
author img

By

Published : Oct 24, 2021, 4:58 PM IST

ఏపీలోని రాజమహేంద్రవరంలోని మంగళవారపుపేటలో 1977 నుంచి వెంకటేశ్వరరావు మిక్చర్‌ పాయింట్‌ నడుస్తోంది. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న చీమకుర్తి సతీశ్‌ ఏదైనా వెరైటీగా చేయాలనే ఉద్దేశంతో 2001 నుంచి రకరకాల బజ్జీలు వేస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా యాపిల్‌, పైనాపిల్‌, మామిడి, ఉల్లి, తమలపాకు, వామాకు, దొండకాయ, బెండకాయ, చిక్కుడు, బ్రెడ్‌, గులాబ్‌జామ్‌, ఎగ్‌లెస్‌ కేక్‌, క్యారెట్‌, క్యాలీఫ్లవర్‌, మష్రూమ్‌, బేబీకార్న్‌ ద్రాక్ష, పనీర్‌, ఉప్మా, క్యాప్సికమ్‌, టమాటా ఇలా సుమారు 30 రకాల బజ్జీలు ఇక్కడ తయారు చేస్తారు. ఒక్కోరోజు.. ఒక్కో స్పెషల్‌ లభిస్తుంది. కొన్ని సీజన్‌ను బట్టీ తయారు చేస్తారు.

VARIETY BAJJIES
బజ్జీలు వేసేందుకు సిద్దంగా ఉంచుకున్న పండ్లు
VARIETY BAJJIES
వివిధ రకాల బజ్జీలు వేస్తున్న చీమకుర్తి సతీశ్‌

ఫోన్లో బుకింగ్‌లు..

ఎంతోకాలంగా వ్యాపారం జరుగుతుండడంతో తన కస్టమర్లతో ఒక వాట్సప్‌ గ్రూపు ఏర్పాటు చేసి.. ఏ రోజు ఏ ఐటం వేసేది.. వారికి మెసేజ్‌ చేస్తారు. కావాల్సిన వారు ఫోన్లో ఆర్డర్‌ ఇచ్చి తీసుకెళ్తారు. రాజమహేంద్రవరం.. చుట్టుపక్కల ప్రాంతాలు, కాకినాడ, తణుకు, బెంగళూరు, విజయవాడ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు వీటిని తీసుకెళ్తున్నారు. ఒక్కరోజే నిల్వ ఉండే వీటిని.. విమానంలోనూ తీసుకెళ్తారని నిర్వాహకులు చెబుతున్నారు. స్థానికంగా జరిగే శుభాకార్యాలకు ఆర్డర్లపై సప్లయ్‌ చేస్తున్నారు. బజ్జీ రూ.10 నుంచి గరిష్ఠంగా రూ.70 వరకు అమ్ముతున్నారు. గులాబ్‌జామ్‌ బజ్జీ రూ.20, జామకాయ రూ.10, పన్నీర్‌, క్యారెట్‌, మష్రూమ్‌ రూ.15 ఇలా ధరలు ఉన్నాయి. క్వాలిటీలో రాజీపడనని..కస్టమర్లతో ఆప్యాయంగా నడుచుకోవడమే వ్యాపారం పెరగడానికి కారణమని అంటున్నారు సతీష్‌.

VARIETY BAJJIES
తయారుగా ఉన్న యాపిల్, జామకాయ బజ్జీలు

ఇదీచూడండి: Dragon Chicken Recipe: రెస్టారెంట్​ స్టైల్​లో డ్రాగన్​ చికెన్​.. ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.