ETV Bharat / city

ఎంఐఎం నుంచి ముగ్గురు హిందువుల విజయం.. - ఎంఐఎం తాజా వార్తలు

బల్దియా పోరులో ఆశించిన స్థాయిలో ఎంఐఎం విజయాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 44 స్థానాల్లో విజయం సాధించగా అందులో ముగ్గురు హిందువులు ఉన్నారు. వీరంతా తొలిసారి గెలుపొందిన వారు అని అనుకుంటే మాత్రం పొరపాటే. నెగ్గిన ముగ్గురు గతంలో కూడా కార్పొరేటర్లుగా ప్రాతినిధ్యం వహించిన వారే.

ఎంఐఎం నుంచి ముగ్గురు హిందువులు విజయం..
ఎంఐఎం నుంచి ముగ్గురు హిందువులు విజయం..
author img

By

Published : Dec 5, 2020, 1:13 PM IST

గ్రేటర్‌ ఎన్నికల్లో మరోసారి మజ్లిస్‌ పార్టీ సత్తా చాటింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమై తొలిరౌండ్‌ ఫలితాలు వెలువడగానే 36 డివిజన్లలో ఆధిక్యం సాధించింది. ఇందులో 20 డివిజన్లలో ప్రత్యర్థులకు అందనంత మెజార్టీతో దూసుకుపోయింది. భాజపా, తెరాసలు ఎన్ని విమర్శలు చేసినా, ఓడించేందుకు ఎంతగా శ్రమించినా.. ఎంపీ అసదుద్దీన్‌, ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ముందుండి నడిపించడంతో పాతబస్తీలో మజ్లిస్‌కి తిరుగులేదని మరోసారి రుజువైంది.

ఎంఐఎం ఓ మతానికి సంబంధించిన పార్టీ కాదని మజ్లిస్​ అధినేత అసదుద్దీన్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు వివరిస్తూనే వచ్చారు. అందుకు తగినట్లుగానే గ్రేటర్​ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో హిందువులను తమ పార్టీ తరఫున బరిలో నిలబెట్టడమే కాకుండా వారిని గెలిపించుకుని తన మాటకి మరింత బలం చేకూరేలా పావులు కదపగలిగారు. నువ్వా-నేనా అన్నట్లు సాగిన బరిలో ఎంఐఎం నుంచి మరోమారు ముగ్గురు హిందువులు విజయం సాధించారు.

కె. తారాబాయి

ఫలక్​నుమా నుంచి తారాబాయి బరిలో దిగారు. ఈమెకు ప్రత్యర్థిగా గిరిధర్​నాయక్​కు తెరాస పోటీకి నిలిపింది. ఫలక్​నుమాలో మొత్తం 19,433 ఓట్లు పోలవ్వగా.. 17,283 ఓట్ల ఆధిక్యంతో తారాబాయి గెలుపొందారు. గత విజేత కూడా ఈమెనే కావడం విశేషం.

సున్నం రాజ్​మోహన్​

పూరానాపూల్​ నుంచి సున్నం రాజ్​మోహన్​ ఎంఐఎం నుంచి బరిలో దిగారు. ఈ డివిజన్​లో మొత్తం 10,777 ఓట్లు పోలయ్యాయి. భాజపా అభ్యర్థి సురేందర్​పై 4,903 ఓట్ల తెడాతో రాజ్​మోహన్​ మరోమారు నెగ్గారు.

స్వామియాదవ్​

కార్వాన్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకున్న మందగిరి స్వామియాదవ్​ తన ప్రత్యర్థి కట్ల అశోక్​పై 1119 ఓట్ల మెజార్టీతో గెలుపోందారు. ఫలితంగా స్వామియాదవ్​ మరో మారు విజయాన్ని కైవశం చేసుకున్నారు.

ఇవీ చూడండి: హైదరాబాద్​ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎగిరిన పతంగి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.