ETV Bharat / city

రాష్ట్రంలో కరోనా విజృంభణ... ఒక్కరోజే రికార్డు కేసులు

author img

By

Published : Jun 18, 2020, 6:07 AM IST

రాష్ట్రంలో కరోనా విజృంభణ ఆగడం లేదు. మరో 269 మందికి కరోనా సోకింది. అత్యధికంగా జీహెచ్​ఎంసీ పరిధిలోనే 214 మందికి వైరస్ నిర్ధారణ అయింది. ఓ కాంగ్రెస్ సీనియర్ నేతకు పాజిటివ్ వచ్చింది. బాధితుల్లో 43 శాతం యువతే ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

corona
corona

రాష్ట్రంలో బుధవారం కొత్తగా 269 కరోనా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోనే 214 నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. తాజాగా ఒకరు మరణించారు. జనగామలో 5, భూపాలపల్లిలో 1, కరీంనగర్‌లో 8, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 1, మహబూబ్‌నగర్‌లో 1, మెదక్‌లో 3, మేడ్చల్‌లో 2, ములుగులో 5, రంగారెడ్డిలో 13, సంగారెడ్డిలో 3, వికారాబాద్‌లో 1, వనపర్తిలో 2, వరంగల్‌ నగరలో 10 కేసుల చొప్పున నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 5,675కు పెరిగింది. టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

పెరిగిన పరీక్షల సంఖ్య

గత రెండు వారాలుగా రోజుకు సుమారు వెయ్యికి పైగా నమూనాలను పరీక్షిస్తుండడంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోందని వైద్యవర్గాలు తెలిపాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30 నియోజకవర్గాల్లో 10 రోజుల్లో 50,000 పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్దేశించడంతో.. నమూనాల సేకరణ వేగంగా జరుగుతోంది. బుధవారం 1,096 నమూనాలను పరీక్షించారు. ఇప్పటి వరకూ జరిపిన పరీక్షల సంఖ్య 45,911కు చేరినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

రుచి, వాసన కోల్పోవడంతో పరీక్ష చేయించుకున్నా

ఒక్కసారిగా రుచి, వాసన కోల్పోవడంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ అని తేలిందని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి తెలిపారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆయన ఒళ్లు నొప్పులు మినహా ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. గూడూరు కారు డ్రైవర్‌ రాజుకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా అతడు చికిత్స కోసం మరో ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది.

మరో నలుగురు వైద్యులకు కరోనా!

కరోనా మహమ్మారి బారిన పడుతున్న వైద్యుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 39 మంది వైద్యులకు వైరస్‌ సోకగా.. బుధవారం మరో అయిదుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో వారి సంఖ్య 44కు చేరింది. తాజాగా మరో ఆరుగురు ఆస్పత్రి సిబ్బందికి సైతం సోకడంతో వారి సంఖ్య 55కు చేరింది.

నిమ్స్‌లో తాజాగా 10 మందికి..

నిమ్స్‌లో ఒక్కరోజే 10 మందికి వైరస్‌ సోకింది. వీరిలో నలుగురు వైద్యులు, మిగతా ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్లాస్టిక్‌ సర్జరీ విభాగంలో ఒక ప్రొఫెసర్‌, నెఫ్రాలజీ విభాగంలో ఇద్దరు రెసిడెంట్‌ వైద్యులు, రేడియాలజీ విభాగంలో మరో రెసిడెంట్‌ వైద్యునికి కరోనా సోకినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మంగళవారం వరకు 22 మంది వైద్యులు కరోనా బారినపడగా.. తాజాగా వారి సంఖ్య 26కు పెరిగింది. కింగ్‌కోఠి ఆస్పత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌కు కూడా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యశాఖ అధికారులు ప్రకటించారు.

బంజారాహిల్స్‌ ఠాణాలో మరో ఇద్దరికి..

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్లో ఇప్పటికే ఒక ఎస్సై, ఏఎస్సై, 18 మంది కానిస్టేబుళ్లు వైరస్‌ బారిన పడగా.. తాజాగా ఓ ఎస్సైతోపాటు మరో కానిస్టేబుల్‌కి సోకినట్లు బుధవారం వెల్లడైంది. ఠాణాలో కరోనా బారినపడిన వారి సంఖ్య 22కి పెరిగింది.

మరో 12 మంది జర్నలిస్టులకు..

మరో 12 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. వారికి రూ. 20వేల చొప్పున, హోం క్వారంటైన్‌లో ఉన్న ఆరుగురు జర్నలిస్టులకు రూ. 10వేల చొప్పున సాయం అందించామని పేర్కొన్నారు.

ఎంజీఎం నుంచి కొవిడ్‌ రోగి పరారీ

వరంగల్‌ శంభునిపేటకు చెందిన యువకుడు జలుబు, జ్వరంతో మంగళవారం ఎంజీఎం ఆసుపత్రిలో చేరాడు. బుధవారం అతనికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రికి పంపించాలని నిర్ణయించారు. ఈ విషయం తెలియగానే వార్డులో ఎవరికి చెప్పకుండా తప్పించుకొని పారిపోయాడు. పోలీసులు, వైద్యాధికారులు గాలిస్తున్నారు.

బాధితుల్లో 43 శాతం యువతే

  • రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన కేసుల్లో 21-40 ఏళ్ల మధ్య వయస్కులు 43.87 శాతంమంది.
  • 41-60 ఏళ్ల మధ్య వయసువారు 32.35 శాతం మంది.
  • మొత్తం కేసుల్లో పురుషులు 3,671 మంది (65 శాతం)
  • మహిళలు 2,004 మంది (35 శాతం).
  • మరణాల్లో అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలున్నవారు ఎక్కువగా ఉన్నారని వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.
  • ఇప్పటివరకూ 192 మరణాలు నమోదుకాగా వారిలో 71మంది (36.97 శాతం) ఈ రెండు దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారే.

ఇదీ చదవండి: లాక్‌డౌన్‌ ఉండదు.. సీఎం కేసీఆర్‌ సందేహంపై ప్రధాని స్పష్టత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.