ETV Bharat / city

ఆపరేషన్​ స్మైల్​: 259 మందిని రక్షించిన రాచకొండ పోలీసులు - operation smile in rachakonda limits

ఆపరేషన్​ స్మైల్​లో భాగంగా 159 మంది రాష్ట్ర, 100 రాష్ట్రేతర చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. వీరిలో 215 మంది బాలురు, 44 మంది బాలికలు ఉన్నారు. దీనిపై 37 మందిపై 18 కేసులు నమోదుచేసినట్లు తెలిపారు.

ఆపరేషన్​ స్మైల్​: 259 మందిని రక్షించిన రాచకొండ పోలీసులు

author img

By

Published : Feb 1, 2020, 6:19 PM IST

Updated : Feb 1, 2020, 7:50 PM IST

ఆపరేషన్​ స్మైల్​లో భాగంగా జనవరి ఒకటి నుంచి 31 వరకు రాచకొండ కమిషనరేట్​ పరిధిలో 259 మంది చిన్నారులను రక్షించినట్లు సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు. అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ తెలుసుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశామన్నారు. మొత్తం 259 మందిలో రాష్ట్రానికి చెందిన 159 మంది బాలబాలికలు ఉన్నారు. వీరిలో 136 మంది బాలురు, 23 మంది బాలికలు ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారిలో 79 మంది బాలురు, 21 మంది బాలికలు ఉన్నట్లు వెల్లడించారు.

రాష్ట్రానికి చెందిన వారిలో.. ఇటుక బట్టీల్లో పనిచేసేవారు 14 మంది, హోటల్స్​లో 9 మంది, బాల కార్మికులుగా 48 మంది, ఇతర సంస్థలు, ఫౌల్ట్రీ ఫాంలలో పనిచేస్తున్న 88 మంది చిన్నారులను సురక్షితంగా రక్షించినట్లు తెలిపారు.

దీనిపై బాలకార్మిక చట్టం 1968, జువైనల్​ జస్టిస్​ చట్టాల ప్రకారం 37 మందిపై 18 కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. బాలకార్మికుల కేసుల్లో రాచకొండ కమిషనరేట్​ పరిధిలోని సిబ్బందిపై ఎటువంటి ఆరోపణలు రావడానికి వీల్లేదని సీపీ మహేశ్​ భగవత్​ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

ఆపరేషన్​ స్మైల్​: 259 మందిని రక్షించిన రాచకొండ పోలీసులు

ఇవీచూడండి: కుమారుడు ప్రేమించాడు.. తండ్రి తాళి కట్టాడు..

Last Updated : Feb 1, 2020, 7:50 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.