ETV Bharat / city

TIRUMALA: శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు.. స్వామివారి సేవలో పలువురు ప్రముఖులు

TIRUMALA: తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారిని దర్శించుకోవాడానికి 24 గంటల సమయం పట్టనుంది. స్వామి వారి దర్శనానికి ప్రజలు కిలోమీటర్ల మేర క్యూలైన్​లో వేచి ఉన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూయాన్, న్యాయమూర్తులు జస్టిస్ సుధీర్ కుమార్, జస్టిస్ శ్రీసుధాలు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

TIRUMALA: శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు.. స్వామివారి సేవలో పలువురు ప్రముఖులు
TIRUMALA: శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు.. స్వామివారి సేవలో పలువురు ప్రముఖులు
author img

By

Published : Jul 10, 2022, 11:17 AM IST

TIRUMALA: ఆంధ్రప్రదేశ్​లోని తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండడంతో కంపార్టుమెంట్లు నిండి కిలోమీటరు మేర భక్తులు వేచి ఉన్నారు. తిరుమలలో నిన్న శ్రీవారిని 87,478 మంది భక్తులు దర్శించుకున్నారు. 48,692 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.53 కోట్లు వచ్చిందిని అధికారులు తెలిపారు.

కోటి విరాళం: శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు పద్మనాభన్ అనే భక్తుడు రూ.కోటి విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును తితిదే ఈవో ధర్మారెడ్డికి ఆయన అందజేశారు.

TS HIGH COURT JUDGE: తిరుమల శ్రీవారిని పలువురు న్యాయమూర్తులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్వల్ భూయాన్, న్యాయమూర్తులు జస్టిస్ సుధీర్ కుమార్, జస్టిస్ శ్రీసుధాలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయాధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి.. శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

DEPUTY CM: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, తెదేపా ఎమ్మెల్యే డోలా బాలవీరాంజానేయలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి.. స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ఇవీ చదవండి:

ప్రాజెక్టులకు పోటెత్తుతోన్న వరద... గేట్లెత్తి దిగువకు నీటి విడుదల

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.