ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2,237 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,42,967కు చేరింది. తాజాగా వైరస్ బారినపడి మరో 12 మంది మృతి చెందగా... మెుత్తం మరణాల సంఖ్య 6,791 గా ఉంది. కొవిడ్ నుంచి మరో 2,256 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,14,773కు చేరింది.
ప్రస్తుతం 21,403 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 86.63 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు బులెటిన్లో పేర్కొంది.
ఇవీ చూడండి: వైద్యుల విశేష సేవలు అభినందనీయం: మంత్రి కొప్పుల