రాష్ట్రంలో కరోనా కేసులు లక్షా 93 వేలు దాటాయి. కొత్తగా 2,214 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,93,600కు చేరింది. మొత్త మృతుల సంఖ్య 1,127కు చేరింది.
కొవిడ్ నుంచి మరో 2,474 మంది కోలుకోగా.. మొత్తం వైరస్ను జయించిన వారి సంఖ్య 1,63,407కి చేరింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 305 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,058 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో 23,702 మంది బాధితులు ఉన్నారు.
ఇవీ చూడండి: అన్లాక్-5.0: ఈ నెల 15 నుంచి 'వినోదం'