ఏపీలో నిన్నటితో పోల్చితే కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 70,695 పరీక్షలు నిర్వహించగా.. 2,010 కేసులు నిర్ధరణ అయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 470 కేసులు అదనంగా నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,59,942 మంది వైరస్ బారినపడినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు బులెటిన్ విడుదల చేసింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 20 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,312కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,956 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,25,631కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 20,999 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,43,24,626 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
జిల్లాల వారీగా నమోదైన కేసులు
ఏపీలో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 386 మందికి వైరస్ సోకగా.. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో పది మంది కొవిడ్ బారిన పడ్డారు. జిల్లాల వారిగా... చిత్తూరు 220, గుంటూరు 170, అనంతపురం 70, వైఎస్ఆర్ కడప 142, క్రిష్ణా 293, నెల్లూరు 206, ప్రకాశం 216, శ్రీకాకుళం 46, విశాఖపట్నం 120, విజయనగరం 25, పశ్చిమ గోదావరి 106 చొప్పున కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.