కరోనా వైరస్ కారణంగా గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 109 మంది మృతి చెందారని వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. గత 24 గంటల్లో 73,749 కరోనా పరీక్షలు చేయగా..18,561 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 17,334 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 2,11,554 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జిల్లాల వారీగా మృతులు
గడచిన 24 గంటల వ్యవధిలో ప.గో. జిల్లాలో అత్యధికంగా 16 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో 10 మంది చొప్పున, తూ.గో., విశాఖ జిల్లాల్లో 9 మంది, కృష్ణా, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో 8 మంది, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, కడప జిల్లాలో ముగ్గురు మృతి చెందారు.
జిల్లాల వారీగా కేసులు
తూ.గో. జిల్లాలో అత్యధికంగా 3,152, విశాఖ 2,098, అనంతపురం 2,094, గుంటూరు 1,639, చిత్తూరు 1,621, శ్రీకాకుళం 1,287, నెల్లూరు 1,282, ప.గో.1,185, ప్రకాశం 1,115, విజయనగరం 962, కర్నూలు 915, కడప 815, కృష్ణా 396 కేసులు నమోదయ్యాయి.
ఇదీచదవండి: 'ఆస్పత్రుల్లో పడకలు ఖాళీగా ఉంటే ఎవరైనా చికిత్స పొందవచ్చు'