రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నానాటికి పెరుగుతోంది. నేడు మరో 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. 665 నమూనాలు పరీక్షిస్తే 18 పాజిటివ్ వచ్చాయని తెలిపారు. తాజా కేసులతో రాష్ట్రంలో వైరస్ సోకిన వారి సంఖ్య 471కి చేరింది.
వైరస్ బారి నుంచి కోలుకుని 45 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 12 మంది మృతి చెందారు. మిగిలిన 414 మందికి గాంధీ, చెస్ట్, కింగ్ కోఠిలో ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రోగులు ఏప్రిల్ 22 వరకు కోలుకునే అవకాశముందన్నారు. మర్కజ్ కేసులు లేకపోతే కరోనా రహిత రాష్ట్రంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. రేపు మరో 60 నుంచి 70 మంది డిశ్చార్జి అయ్యే అవకాశముందని ఈటల ప్రకటించారు. రేపటి నుంచి కరోనా కేసులు తగ్గే ఆస్కారం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి: