ETV Bharat / city

Vacancies in Telangana Police Department : పోలీసు శాఖలో 17వేల పోస్టులు ఖాళీ - తెలంగాణ పోలీసు శాఖలో ఖాళీలు

Vacancies in Telangana Police Department : ఎంతో కాలంగా యువత ఎదురుచూస్తున్న పోలీసు ఉద్యోగ నియామకాల ప్రకటన త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర పోలీసు శాఖలో 17వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. త్వరలో ఈ ఉద్యోగాల భర్తీకీ ప్రకటన విడుదలయ్యే అవకాశముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Vacancies in Telangana Police Department

author img

By

Published : Feb 16, 2022, 8:20 AM IST

Vacancies in Telangana Police Department : రాష్ట్ర పోలీసు శాఖలో 17 వేల ఉద్యోగ ఖాళీలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పోలీసు శాఖలోనూ ఖాళీల గుర్తింపు ప్రక్రియ కొలిక్కి రాగా అన్ని శాఖలతోపాటు పోలీసు ఉద్యోగాల భర్తీకి కూడా ప్రకటన విడుదలయ్యే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నియామకాలపై కసరత్తు..

Telangana Police Department Vacancies : ఈ శాఖలో దాదాపు 16 వేల కానిస్టేబుల్‌, వెయ్యి ఎస్సై పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని అధికారులు లెక్కగట్టినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) వాస్తవానికి గతేడాదే ఉద్యోగ భర్తీ ప్రక్రియ చేపట్టాలని భావించినా.. కొత్త జోన్లు, జిల్లా ఏర్పాటుకు సంబంధించిన సాంకేతిక అడ్డంకుల కారణంగా ముందుకు సాగలేదు. ప్రస్తుతం అన్ని రకాల అడ్డంకులు తొలగడంతో ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ఉద్యోగ ప్రకటన విడుదల చేసేందుకు నియామక మండలి సిద్ధమైంది. ఈ సారి కొత్త జోన్లు, జిల్లాల వారీగా నియామకాలను చేపట్టనుంది. తప్పులు, సమస్యలకు తావులేకుండా అభ్యర్థులు ఫోన్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

త్వరలోనే నోటిఫికేషన్లు..!

Telangana Police Department Recruitment 2022 : మరోవైపు.. శేషాద్రి నేతృత్వంలోని ఐఏఎస్​ అధికారుల కమిటీ ఖాళీల గుర్తింపు సహా సంబంధిత కసరత్తు పూర్తి చేసింది. గతంలో గుర్తించిన ఖాళీలతో పాటు.. కొత్త మున్సిపాలిటీల్లో అవసరమైన పోస్టులు, పదోన్నతులు, పదవీ విరమణల ద్వారా ఉత్పన్నమయ్యే ఖాళీలను పరిగణలోకి తీసుకొని.. మొత్తం జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 70 వేలకు పైగా ఖాళీలను గుర్తించినట్లు సమాచారం. ఖాళీల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఖాళీల వివరాలు, జాబితా ఆధారంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నిర్ణయానికి రానున్నారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.