తెలంగాణలో కొత్తగా 17 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. శనివారం నిర్థరణ అయిన వారిలో 15 మంది జీహెచ్ఎంసీ పరిధిలోని వారున్నారని.. మరో ఇద్దరు రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిగా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 1061కి చేరింది. ఇవాళ ఒకరు మృతిచెందగా.. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 29కి చేరింది.
ఇప్పటి వరకు 499 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 533 మంది కొవిడ్-19 చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా సోకిన వారిలో 705 మంది పురుషులు.. 356 మంది స్త్రీలు ఉన్నారు. కరోనా బారిన పడిన పురుషులు 66.5శాతం కాగా... స్త్రీలు 33.5 శాతం మంది ఉన్నారు.
ఇప్పటి వరకు వరంగల్ రూరల్, యాదాద్రి, వనపర్తి జిల్లాల్లో కరోనా కేసులు అసలే నమోదు కాలేదు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, సిద్దిపేట, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, నారాయణపేట జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఇవీచూడండి: దేశవ్యాప్తంగా 24 గంటల్లో 2,411 మందికి వైరస్