ఏపీలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 65,596 మంది నమూనాలు పరీక్షించగా 1,623 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 8 మంది మృతి చెందారు. కరోనా నుంచి తాజాగా 1,340 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,158 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

ఇదీ చదవండి : MLA Rajaiah viral video: చిన్నారులతో కలిసి బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేసిన తెరాస ఎమ్మెల్యే