ETV Bharat / city

Food Poison in BC boys Hostel Hyderabad : బీసీ బాలుర వసతిగృహంలో 15 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poison in BC boys Hostel Hyderabad : హైదరాబాద్ సరూర్​నగర్​లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో కలుషిత నీరు తాగి 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పి, ఛాతీలో నొప్పితో ఇబ్బంది పడుతున్న వారిని హాస్టల్ నిర్వాహకులు నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు.

Food Poison in BC boys Hostel Hyderabad, ఫుడ్ పాయిజన్, విద్యార్థులకు అస్వస్థత
Food Poison in BC boys Hostel Hyderabad
author img

By

Published : Nov 27, 2021, 8:06 AM IST

Food Poison in BC boys Hostel Hyderabad : హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో కలుషిత నీరు తాగి 15 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్న వారికి హాస్టల్ నిర్వాహకులు నీలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థులకు ఎటువంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

Food Poison in BC boys Hostel Saroornagar : వసతి గృహంలో సదుపాయాలు లేవని కనీసం తాగేందుకు సరైన నీరు కూడా లేదని విద్యార్ధులు ఆరోపించారు. ఉపాధ్యాయులు మాత్రం మినరల్​ వాటర్​ అందిస్తున్నామని.. విద్యార్దులు తెలియక వేరే నీళ్లు తాగారని చెబుతున్నారు. మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ ఎడ్యుకేషన్ సొసైటీలో ఐదవ తరగతి నుంచి ఇంటర్ వరకు 810 మంది విద్యార్థులు చదువుతున్నారు. గత వారం రోజుల నుంచి వసతిగృహంలో తాగు, ఇతర అవసరాలకు నీరు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నమని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

"మూడ్రోజుల నుంచి హాస్టల్​లో నీళ్లు లేవు. మేం స్నానాలు కూడా చేయలేదు. బట్టలు ఉతుకుదామని నానబెట్టాం. ఇప్పటి వరకు ఉతకలేదు. స్నానాలు చేయకపోవడం వల్ల అలర్జీ వస్తోంది. తాగడానికి కూడా నీళ్లు లేవని చెబితే.. ఎక్కడి నుంచో బోర్ నీళ్లు తీసుకువచ్చారు. అవి 12 ఏళ్ల పిల్లలు తాగారు. తాగినప్పటి నుంచి ఛాతీలో నొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. ఏమైందని అడిగితే నీళ్లు తాగిన తర్వాతే ఇలా అవుతోందని చెప్పారు. వెంటనే సార్ వాళ్లకు చెప్పాం. సార్ వాళ్లు మా ఫ్రెండ్స్​ను ఉస్మానియా ఆస్పత్రికి పంపించారు. అక్కడ వాళ్లని అడ్మిట్ చేసుకోలేదు. తర్వాత నీలోఫర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. సెక్రటరీ సార్ హాస్టల్​ పరిశీలనకు వచ్చినప్పుడు కలిసి మా సమస్యలు చెబుదామనుకుంటే.. మా వార్డెన్ కలవనివ్వరు. ఎన్నిసార్లు చెప్పినా మా సమస్యలు పరిష్కరించడం లేదు. మేమేం ఎక్కువ అడగడం లేదు. కనీస సదుపాయాలు.. తాగునీరు, ఆరోగ్యకరమైన ఆహారం మాకు కావాల్సింది అంతే."

- విద్యార్థులు

"నీళ్లు తాగిన తర్వాత 15 మంది అస్వస్థతకు గురయ్యారంట. వాళ్లని ఆస్పత్రికి తీసుకువచ్చారు. వాళ్లలో కొందరు ఇంతకు ముందే జ్వరంతో బాధపడుతున్నారు. వాళ్లందరికి ఫ్లూయిడ్స్ ఇస్తున్నాం. ప్రాణాపాయం ఏం లేదు. రెండ్రోజుల్లో కోలుకుంటారు."

- వైద్యుడు

ఇవీ చదవండి :

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.