ETV Bharat / city

12 వేల మంది కరోనా రోగులకు 'గాంధీ' పునర్జన్మ - corona cases recovered from gandhi

కరోనా మహమ్మారిని జయించి ఎంతో మంది ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. అందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నది గాంధీ ఆసుపత్రి. కరోనా మొదటి కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొంది 12 వేల మంది ఆరోగ్యవంతులుగా మారి ఇంటికి వెళ్లారు.

12 thousand corona patients recover from gandhi hospital

author img

By

Published : Sep 12, 2020, 9:31 AM IST

కరోనా బారినపడి గాంధీ ఆసుపత్రిలో చేరిన ఎంతోమంది పునర్జన్మ పొంది బయటపడుతున్నారు. ఈ ఏడాది మార్చి 2న తొలి కేసు నమోదైనప్పటి నుంచి ఈ ఆసుపత్రిని కొవిడ్‌ చికిత్సలకు కేటాయించిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఇప్పటివరకు దాదాపు 12వేల మంది కరోనాకు చికిత్స తీసుకొని స్వస్థత పొంది ఇళ్లకు వెళ్లారు. ఇందులో 4200 మంది ఐసీయూలో ఉండి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇందులో 40-90 ఏళ్ల మధ్యవారే అధికం.

అహర్నిశలు శ్రమిస్తూ..

కరోనాకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాలంటే లక్షలాది రూపాయలు వెచ్చించాల్సిందే. ఈ క్రమంలో పేద రోగులకు గాంధీ వైద్యశాల అండగా ఉంటోంది. మొత్తం 1800 పడకలు కొవిడ్‌ చికిత్సల కోసం ఉన్నాయి. 200 మంది వైద్యులు, 400-500 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఐసీయూలో 500 పడకలు ఉన్నాయి. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటే సాధారణ వార్డుల్లోను, రక్తంలో ఆక్సిజన్‌ తగ్గినవారికి ఆక్సిజన్‌ వార్డుల్లో..తీవ్ర లక్షణాలతోపాటు శ్వాసకు ఇబ్బంది తలెత్తితే ఐసీయూలో చికిత్సలు అందిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చిన తర్వాత లక్షణాలు ఎక్కువ ఉంటే వెంటనే ఆసుపత్రిలో చేరాలని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు తెలిపారు. నాణ్యమైన సేవలు అందించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్​తో కలిసి భోజనం చేసిన చాడ వెంకటరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.