ETV Bharat / city

Padma Awards 2022 : పద్మశ్రీ అందుకున్న కిన్నెర మొగిలయ్య

Padma Awards 2022 : రాష్ట్రపతి భవన్‌లో 2022 సంవత్సరానికి సంబంధించిన పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణకు చెందిన 12 మెట్ల కిన్నెర వాద్యకారుడు, గిరిజన జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య,  భద్రాచలం సీతారామస్వామి ఆలయంలో నాదస్వర సంగీతకారుడిగా సేవలందించిన గోసవీడు షేక్‌ హుస్సేన్‌కు మరణానంతరం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన మనవడు షేక్‌ హిలమ్‌ షా ఉద్దీన్‌ అందుకున్నారు.

author img

By

Published : Mar 22, 2022, 7:05 AM IST

Padma Awards 2022
Padma Awards 2022

Padma Awards 2022 : రాష్ట్రపతి భవన్‌లో 2022 సంవత్సరానికి సంబంధించి పద్మ పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విడతల వారీగా అవార్డుల ప్రదానం చేపట్టగా.. సోమవారం ఇద్దరికి పద్మవిభూషణ్‌, 8 మందికి పద్మభూషణ్‌, 54 మందికి పద్మశ్రీ పురస్కారాలను రాష్ట్రపతి ప్రదానం చేశారు.

పద్మాలంకృతులైన వేళ..

Padma Awards 2022 For Telangana : తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. 12 మెట్ల కిన్నెర వాద్యకారుడు, గిరిజన జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్య, ప్రముఖ ప్రవచనకారుడు, రచయిత, సహస్రావధాని గరికపాటి నరసింహారావు, విశాఖపట్నానికి చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు సుంకర వెంకట ఆదినారాయణరావు పురస్కారాలను స్వీకరించారు. భద్రాచలం సీతారామస్వామి ఆలయంలో నాదస్వర సంగీతకారుడిగా సేవలందించిన గోసవీడు షేక్‌ హుస్సేన్‌కు మరణానంతరం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన మనవడు షేక్‌ హిలమ్‌ షా ఉద్దీన్‌ అందుకున్నారు.

మొగిలయ్య
షేక్ హిలమ్ షా ఉద్దీన్
వెంకట ఆదినారాయణరావు
గరికపాటి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.