ETV Bharat / city

Burripalem: సూపర్ స్టార్ దత్తత గ్రామంలో 100 శాతం వాక్సినేషన్ పూర్తి

సూపర్​స్టార్ ​మహేశ్​ బాబు దత్తత గ్రామంలో వందశాతం వాక్సినేషన్ పూర్తయినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనెల 10 నుంచి ఈరోజు వరకు కొనసాగిన రెండో దశ టీకా పంపిణీ ప్రక్రియ విజయవంతంగా ముగిసిందని వివరించారు.

vaccination
సూపర్​స్టార్ ​మహేశ్​ బాబు
author img

By

Published : Jul 12, 2021, 9:58 PM IST

సూపర్​స్టార్ ​మహేశ్​ బాబు దత్తత గ్రామం ఏపీలోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో కొవిడ్ వాక్సినేషన్ వందశాతం పూర్తయినట్లు నిర్వాహకులు తెలిపారు. 'మహేశ్ ఫౌండేషన్​' ద్వారా మే 31న మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభమైన మొదటి దశ వాక్సిన్ పంపిణీ.. నేటితో విజయవంతంగా ముగిసినట్లు వెల్లడించారు. ఆంధ్ర ఆసుపత్రి పర్యవేక్షణలో రెండో దశ ప్రక్రియ ఈనెల 10 నుంచి ఈరోజు వరకు కొనసాగింది. మూడు రోజుల పాటు సాగిన ఈ కార్యక్రమం సజావుగా సాగిందని నిర్వాహకులు పెమ్మసాని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

కొవిడ్ విపత్కర పరిస్థితుల నుంచి తమ గ్రామస్థులను కాపాడుకునేందుకు ఫౌండేషన్ ద్వారా వ్యాక్సిన్​ను ఉచితంగా పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. మొదటి దశలో 1,250 మందికి వేశామని ఆంధ్ర ఆసుపత్రి డాక్టర్ ఆనంద్ వెల్లడించారు. తాజాగా రెండో దశలో కూడా అందరికీ టీకా వేసినట్లు వివరించారు. టీకా తీసుకున్నవారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వెలుగుచూడలేదని... ప్రస్తుతం అందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్వాహకులు చెప్పారు.

దత్తత గ్రామంపై మమకారంతో మహేశ్​ బాబు టీకాలు పంపిణీ చేసినందుకు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామంలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి అయ్యాయని.. రాబోయే కాలంలో కూడా గ్రామానికి 'మహేశ్​ బాబు ఫౌండేషన్' అండగా ఉండాలని గ్రామస్థులు కోరారు.

ఇదీ చూడండి: Lower manair dam: రైతులకు గుడ్​ న్యూస్.. దిగువ మానేరు డ్యాం నుంచి నీరు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.