ETV Bharat / city

ప్రతి రోజూ 100 గ్రాముల పండ్లు తప్పక తినాలి

ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ రోజూ తప్పనిసరిగా 100 గ్రాముల పండ్లు తినాలని ‘భారతీయ వైద్య పరిశోధన మండలి’ (ఐసీఎంఆర్‌) సూచించినట్లు తెలిపింది. ప్రజలు రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ప్రతి రోజూ పండ్లు విరివిగా తినాలని రాష్ట్ర ఉద్యానశాఖ సూచించింది.

100 grams of fruits must be eaten daily
ప్రతి రోజూ 100 గ్రాముల పండ్లు తప్పక తినాలి
author img

By

Published : Apr 5, 2020, 8:04 AM IST

ప్రజలు రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి పండ్లు విరివిగా తినాలని రాష్ట్ర ఉద్యానశాఖ సూచించింది. ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ రోజూ తప్పనిసరిగా 100 గ్రాముల పండ్లు తినాలని ‘భారతీయ వైద్య పరిశోధన మండలి’ (ఐసీఎంఆర్‌) సూచించినట్లు తెలిపింది. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు పండ్లను అధికంగా తినాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్లకు ఈ శాఖ తాజాగా సూచించింది.

  • అధిక పోషక విలువలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ యాక్సిడెంట్లు తాజాపండ్లలోనే ఎక్కువగా ఉంటాయి.
  • సిట్రస్‌ జాతికి చెందిన బత్తాయి, నిమ్మతోపాటు మామిడిలోనూ విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణకోశ ఆరోగ్యానికి నిమ్మ మేలు చేస్తుంది.
  • బత్తాయిలో పోషక విలువలతోపాటు పీచు, జింక్‌, కాపర్‌, ఇనుము, కాల్షియం వంటివి ఉంటాయి. ఊబకాయం, అలసటను తగ్గించడానికి ఉపకరిస్తుంది.
  • రేచీకటి, జలుబు, దగ్గు నియంత్రణకు మామిడి ఉపకరిస్తుంది. ఊపిరితిత్తులను కాపాడుతుంది.
  • రాష్ట్రంలో ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో బత్తాయిలు 70 వేల టన్నులు, మామిడి 6 లక్షల టన్నులు, నిమ్మ 1.22 లక్షల టన్నుల దిగుబడి అందుబాటులోకి వస్తుందని, తక్కువ ధరలకు లభిస్తున్నందున ప్రజలు విరివిగా తినాలని ఉద్యానశాఖ సంచాలకుడు వెంకట్రామిరెడ్డి సూచించారు.

ఇదీ చూడండి : నేటి రాత్రి లైట్లు మాత్రమే ఆపాలి: సీఎండీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.