ETV Bharat / city

TSRTC CARGO SERVICES : కార్గో కోసం ఆ ఆర్టీసీ బస్సులే లారీలిక! - టీఎస్​ఆర్టీసీ కార్గో సేవలు

కరోనా వ్యాప్తి, లాక్​డౌన్ వల్ల నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకురావడానికి రాష్ట్ర రవాణా శాఖ(Telangana Transport Ministry) అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అదనపు ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రవేశపెట్టిన కార్గో, పార్శిల్(TSRTC CARGO SERVICES) సేవలు కొంతమేరకు ఆదాయన్ని సమకూరుస్తున్నాయి. ఈ సేవలను మరింత విస్తృతం చేసేందుకు టీఎస్​ఆర్టీసీ మరో కొత్త అడుగు వేసింది. కార్గో సేవల(TSRTC CARGO SERVICES) కోసం కొన్ని బస్సులను లారీగా మార్చి అందుబాటులోకి తీసుకువచ్చింది.

కార్గో సేవల కోసం బస్సులను లారీలుగా మార్చిన ఆర్టీసీ

author img

By

Published : Oct 14, 2021, 12:12 PM IST

కార్గో సేవలను విస్తృతం చేసేందుకు టీఎస్‌ఆర్టీసీ(Telangana RTC) కొన్ని బస్సులను పూర్తిస్థాయి లారీలుగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రయోగాత్మకంగా పది బస్సులను ఓపెన్‌టాప్‌ లారీలుగా మార్చి సిమెంటుతో పాటు ట్రాన్స్‌ఫార్మర్లను సైతం రవాణా చేస్తోంది. ప్రస్తుతం కార్గో సేవల(TSRTC Cargo Services) కోసం సంస్థ 185 బస్సులను వినియోగిస్తోంది. ఇటీవల పది బస్సులను ఓపెన్‌ టాప్‌ లారీలుగా మార్చి సరకు రవాణాకు అందుబాటులో ఉంచడంతో ఈ వాహనాల సంఖ్య 195కు చేరింది. ఆదరణ బాగుండడంతో మరో 50 కార్గో వాహనాల కొనుగోలుకు నిర్ణయించారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌(Telangana Transport Minister Puvvada Ajay Kumar) ఇటీవల అసెంబ్లీలో సైతం ఈ విషయాన్ని ప్రకటించారు. కార్గో బుకింగ్స్‌ కోసం వచ్చే నెల నుంచి బస్‌ డిపోలు, బుకింగ్‌ ఏజెంట్లకు టికెట్‌ జారీ యంత్రాలను అందించనున్నారు. ఇకపై రాష్ట్రంలోని సుమారు 37 వేల అంగన్‌వాడీ కేంద్రాలకు నేరుగా ఆర్టీసీ కార్గో(Telangana RTC Cargo) ద్వారా బియ్యం, విజయా నూనె, ఇతర ఉత్పత్తులను అందజేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది.

అసెంబ్లీలో కార్గో, పార్శిల్ సేవల గురించి మంత్రి పువ్వాడ ఏమన్నారంటే..

గతేడాది జూన్ 19.. 2020​లో కార్గో, పార్శిల్ సేవలు ప్రారంభించామని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని కాస్త గాడిన పట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి పువ్వాడ(Telangana Transport Minister Puvvada Ajay Kumar) తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 177 బస్టాండ్​ల నుంచి 790 మంది ఏజెంట్లు కార్గో సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. కార్గో, పార్శిల్ సేవలకు సంబంధించి ఈ-కామర్స్ సంస్థలతో బిజినెస్ లింకప్​ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అమెజాన్​తో లింకప్(TSRTC Cargo Services Link up with amaZON)​ అయ్యేందుకు చర్చిస్తున్నామన్న మంత్రి(Telangana Transport Minister Puvvada Ajay Kumar) .. త్వరలోనే ఎంఓయూపై సంతకం చేస్తామని స్పష్టం చేశారు. కార్గో సేవలు గ్రామాలకు కూడా విస్తరించామని.. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​లోని చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా.. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి పెరిగిన ఇంధన ధరలు పెనుభారమవుతున్నాయని పేర్కొన్నారు. కార్గో, పార్శిల్ సర్వీసులతో ఆర్టీసీని గాడిన పట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.