ETV Bharat / city

గ్యాస్​ లీకేజీ ఘటన: ఇంకా కళ్ల ముందే దుర్ఘటన దృశ్యాలు

ఏడాది క్రితం దేశ వ్యాప్తంగా కరోనా మొదటి దశ ఉద్ధృతంగా ఉండగా.. సరిగ్గా ఇదేరోజున ఆంధ్రప్రదేశ్​ ప్రజలను మరో దుర్ఘటన ఉలిక్కి పడేలా చేసింది. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనను తలపిస్తూ విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన పెను సంచలనమే సృష్టించింది. అనేక మంది నిద్రలోనే అపస్మారక స్థితిలోకి వెళ్లి ప్రాణాలు విడిచిన ఆ ఘోరం ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రాణాల కోసం బాధితుల పరుగులు పెట్టిన దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి. రంగు మారిన పచ్చని చెట్ల గుర్తులు ఇంకా చెరిగిపోలేదు. ఇంకా ఆ విషాద జ్ఞాపకాలు విశాఖ ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి.

LG polymers incident, one year for lg polymers incident
గ్యాస్​ లీకేజీ ఘటన: ఇంకా కళ్ల ముందే దుర్ఘటన దృశ్యాలు
author img

By

Published : May 7, 2021, 9:49 AM IST

Updated : May 7, 2021, 10:46 AM IST

తేదీ: 07-05-2020, బుధవారం అర్ధరాత్రి

గాఢ నిద్రలో ఉన్న విశాఖ వాసులు.. ఒక్కసారిగా చుట్టూ అలుముకున్న పొగ మంచు.. తేరుకునేలోపే 12 మంది మృతి..వందలాది మందికి అస్వస్థత.. వేలాది మూగజీవాలు బలి.. స్టైరిన్‌ లీకై 5 గ్రామాలను కకావికాలం చేసింది.

అప్పటిదాకా నిద్రపోతున్న వారిలో ఒక్కసారిగా కలకలం రేపింది. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒంటిపై దురదలు, కళ్లలో మంటతో గాఢ నిద్రలో ఉన్నవారు సైతం నిద్రలేచారు. బయటికి వచ్చే చూసే సరికి రసాయనాల ఆవిరి చుట్టముట్టింది. చలికాలంలో పొగమంచు తరహాలో కమ్ముకుంది. ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిశాయి. వందలాది మంది అస్వస్థతకు గురై రోడ్డున పడ్డారు. చెట్లు మాడి మసైపోయాయి. పక్షుల సవ్వళ్లు ఆగిపోయాయి. మూగజీవాలు కకావికలం అయ్యాయి. వేలాది మంది ప్రజలు ఇల్లూ వాకిలి వదిలి పరుగులు తీశారు. ఇది గతేడాది సరిగ్గా ఈ రోజు అర్ధరాత్రి దాటక జరిగిన పరిస్థితి.

గ్యాస్​ లీకేజీ ఘటన: ఇంకా కళ్ల ముందే దుర్ఘటన దృశ్యాలు

వందలాది జీవితాలు అతలాకుతలం

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ శివారులోని గోపాలపట్నం మండలం వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూసివేశారు. లాక్‌డౌన్‌ తర్వాత ఇచ్చిన వెసులుబాటులో భాగంగా కంపెనీలో ఉత్పత్తిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఇక్కడ ఏసీలు, ఫ్రిజ్‌లు తయారుచేసే విడిభాగాలు తయారవుతాయి. దీనికి ప్రధాన ముడి సరకు 'స్టైరిన్‌ మోనోమర్‌'. ఇది ప్రమాదకర రసాయనం. 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. ఉష్ణోగ్రతలు పెరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఆ రోజు జరిగిన సాంకేతిక లోపాల వల్ల స్టైరిన్‌ వాయువు లీకై.. సృష్టించిన విధ్వంసం.. వందలాది జీవితాలను అతలాకుతలం చేసింది.

ప్రభుత్వంపైనే ఆశలు

పాలిమర్స్‌ దుర్ఘటనతో వెంకటాపురం, వెంకటాద్రిగార్డెన్‌, పద్మనాభనగర్‌, జనతాకాలనీ, నందగిరినగర్, ఎస్సీ కాలనీ వాసులకు మూడురోజులు కంటి మీద కునుకులేకుండా చేసింది. రాత్రంతా రోడ్లపైనే బిక్కుబిక్కుమంటూ తిరుగుతూనే ఉండేలా చేసింది. నాటి విషాద ఘటనకు ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాదిలో ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎన్నో ఇబ్బందులు ఈ గ్రామాల ప్రజలను చుట్టుముట్టాయి. అయినా రేపటి మీద ఆశ, నమ్మకం వారిని బతికిచ్చింది. ఎప్పటికైనా ప్రభుత్వం చూడకపోతుందా? ఆదుకోకపోతుందా? అనే భరోసాతో అడుగులు వేస్తూనే ఉన్నారు.

ఇంకా అనారోగ్యమే

ప్రమాదానికి గురైన ట్యాంకర్లు దగ్గరగా ఉన్న వెంకటాపురం, వెంకటాద్రినగర్‌ గ్రామాల్లోని ప్రజలు ఇంకా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. స్థానికులను ఎవరిని కదిపినా కన్నీరు పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు అలసట, నీరసం సమస్యతో బాధపడుతున్నారు. గుండెల్లో దడ అనిపించడంతో పాటు కాళ్లూ చేతులు లాగడం, మోకాళ్లు నొప్పులు వారిని కలవరపెడుతున్నాయి. మహిళల్లో ఆయాసం, తలనొప్పి, అజీర్తి సమస్యలు వస్తున్నాయి. కొద్దిమంది యువతలో ఆయాసం, త్వరగా అలసిపోవడం, తల తిరగడం వంటి లక్షణాలతో బాధపడుతున్నారు.

హామీలెక్కడ?

ప్రమాద సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని.. స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అప్పుడు తాత్కాలిక పరిహారం ఇచ్చి.. చేతులు దులుపుకొందని వాపోతున్నారు. బాధిత గ్రామాలకు ఇచ్చిన హామీల్లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వైద్య కేంద్రం కొద్ది నెలలే పనిచేసిందని వాపోయారు. బాధిత గ్రామస్థులకు ఇచ్చిన హెల్త్‌కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదని విమర్శిస్తున్నారు.

ఇప్పటికీ బాధిత గ్రామాలలో భూగర్భ జలాలు రంగుమారి కనిపిస్తున్నాయి. స్టైరీన్‌ విషవాయువులు వెలువడిన తరువాత భూగర్భం నుంచి వచ్చే నీరు మరింత ముదురు రంగులోకి మారింది. ఆ నీరు ఉపయోగించడానికి వీలులేకుండా ఉందని స్థానికులు వాపోతున్నారు.

ఇదీ చదవండి: రాముడి పుల్లయ్య.. రామచంద్రయ్యగా ఎలా మారాడు?

Last Updated : May 7, 2021, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.