లోక్సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సన్నద్ధంగా ఉందని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్లో కేశవ్ మెమోరియల్ కాలేజ్ మైదానంలో బీసీల ఆత్మ గౌరవ సభను నిర్వహించారు. ఈ సభకు లక్ష్మణ్, కిషన్రెడ్డి, రాంచందర్రావు హాజరయ్యారు. రెండు సార్లు బీసీల ఓట్లతో గెలిచిన తెరాస సర్కార్ 33 శాతం ఉన్న రిజర్వేషన్లను 23శాతానికి తగ్గించిందని లక్ష్మణ్ మండిపడ్డారు. కేటీఆర్ పట్టపగ్గాలు లేకుండా మాట్లాడుతున్నారని కిషన్రెడ్డి విమర్శించారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి సంబంధించినవి కావని దేశానికి సంబంధించినవన్నారు. రాహుల్ గాంధీ పిచ్చిపిల్లాడిలా మాట్లాడుతున్నాడని ఎంపీ బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతలందరూ ఏకమైనా నరేంద్రమోదీ గెలుపును అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి:సాహసమే ఊపిరిగా..