ETV Bharat / city

కేసీఆర్ ప్రగతి పద్దు

ఎన్నికల హామీల అమలును నెరవేర్చేలా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఓట్ ఆన్ అకౌంట్​బడ్జెట్​ ప్రవేశపెట్టారు. 1,82,017 కోట్ల పద్దును సభ ముందుంచారు. ముందు నుంచి చెబుతున్నట్లుగా అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇస్తూ ఆయన బడ్జెట్ సమర్పించారు.

అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం
author img

By

Published : Feb 22, 2019, 8:06 PM IST

Updated : Feb 22, 2019, 8:25 PM IST

తెరాస రెండోసారి అధికార పగ్గాలు చేపట్టాక మెుదటి అసెంబ్లీ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ఓటాన్​ అకౌంట్​ బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. ఇటీవల ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు పెద్దపీట వేశారు. రైతుల సంక్షేమం కోసం అగ్రభాగం కేటాయింపులు చేశారు.
లక్షా 82వేల 17కోట్ల రూపాయలతో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రూపొందించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,31,629 కోట్లు, ఆర్థికలోటు రూ.27,749 కోట్లుగా తేల్చారు. రెవెన్యూ మిగులు రూ.6,564 కోట్లు కాగా... ప్రగతి పద్దు రూ.1,07,302 కోట్లు, నిర్వహణ పద్దు రూ.74,715 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
విద్యుత్ వెలుగులు
విభజన తరువాత విద్యుత్ సమస్యలను తక్కువ సమయంలోనే పరిష్కరించి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. మిగులు విద్యుత్​ రాష్ట్రంగా మార్చేందుకు కొత్త పాంట్ల నిర్మాణం జరుగుతోందన్నారు. సౌర విద్యుత్త్​ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రెండోస్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు.
రైతు బంధు దేశానికే ఆదర్శం
రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రైతు బంధే ఆదర్శమన్నారు. ప్రస్తుతం తెలంగాణ అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఇది రాష్ట్రానికే గర్వకారణమని స్పష్టం చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు.
ఆరోగ్య తెలంగాణ..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. మందుల కొనుగోలు కోసం నిధుల్ని మూడింతలు పెంచినట్లు తెలిపారు. డయాలసిస్ కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, నూతన వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. కంటి వెలుగు కొనసాగింపుతో పాటు చెవి, ముక్కు ,గొంతు పరీక్ష శిబిరాలు ఏర్పాటు కోసం రూ.5,536కోట్లు కేటాయింపులు జరిగాయి.
కేసీఆర్ పద్దులో ఆసరా పింఛన్లకు రూ.12,067కోట్లు, రైతు బంధుకు రూ.12వేల కోట్లు, వ్యవసాయ శాఖకు రూ.20,107 కోట్లు, నీటి పారుదల శాఖకు రూ 22,500 కోట్లు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ కోసం రూ.1450 కోట్లు, ఎస్సీల సంక్షేమం కోసం రూ.16,581 కోట్లు, ఎస్టీల అభ్యున్నతి కోసం రూ. 9,827 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.2004 కోట్లు కేటాయించారు.
వైద్యానికి పెద్దపీట వేస్తూ... ఆరోగ్యశాఖకు రూ.5,536కోట్లను ప్రతిపాదించారు. బీసీల కోసం మరో 119 గురుకులాలు ఏర్పాటు కానున్నాయి. గతంలో లాగానే ఈసారి యాదవులు, ముదిరాజ్​లకు కేటాయింపులు పెరిగాయి. సాంఘిక సంక్షేమ రంగానికి 14,005 కోట్లు, గిరిజన సంక్షేమం కోసం 8,970 కోట్లు, బీసీ సంక్షేమానికి 4,528 కోట్లు, మహిళా సంక్షేమం కోసం 1,628 కోట్లు కేటాయించారు.
ఇవీ చదవండి:రేపే డిప్యూటీ నోటిఫికేషన్​

undefined

Last Updated : Feb 22, 2019, 8:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.