ETV Bharat / city

లోక్​సభ సమరానికి సై - kcr

బడ్జెట్‌ సమావేశాలు ముగిసిన  వెంటనే లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ నెల నాలుగో వారంలో బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్నారు. అనంతరం ఎన్నికల ప్రచార ఢంకా మోగించనున్నారు. ఖమ్మం లేదా మహబూబాబాద్‌లో భారీ బహిరంగ సభతో.. రణరంగంలోకి దిగాలని భావిస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సీఎం కసరత్తు
author img

By

Published : Feb 11, 2019, 5:20 AM IST

Updated : Feb 11, 2019, 8:25 AM IST

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి సీఎం కసరత్తు
లోక్‌సభ ఎన్నికలపై తెరాస దృష్టి పెట్టింది. ప్రచారపర్వంపై ప్రగతి భవన్‌లో కేసీఆర్​ సమాలోచనలు జరిపారు. ఈ నెల 13న పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్‌ వెలవడవచ్చని అంచనా. దీనికి అనుగుణంగా పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ఈ నెల 18 నుంచి 20 వరకు.. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటన, అనంతరం బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. అవి ముగిసిన వెంటనే పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తమవుతారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై గులాబీ దళపతి కసరత్తు చేపట్టారు. ఇటీవల నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ఆయన ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రకటించిన విధంగానే ఆయన కొన్ని స్థానాల్లో ప్రస్తుత ఎంపీలకు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. నిజామాబాద్‌ నుంచి కవిత, ఆదిలాబాద్‌ - జి.నగేశ్‌. కరీంనగర్‌-వినోద్‌కుమార్‌, భువనగిరి - బూర నర్సయ్యగౌడ్‌కు టికెట్లు దాదాపు ఖరారయ్యాయి. మిగిలిన స్థానాల్లో కొందరికి అవకాశం ఇవ్వాలని సీఎం భావిస్తున్నా.. అక్కడ నెలకొన్న సమీకరణాలు, ఇతర పరిణామాలేమైనా చోటు చేసుకుంటే మార్పులు జరిగే అవకాశం ఉంది. మరోవైపు కొందరు నేతలపై అసమ్మతి కారణంగా కొత్త అభ్యర్థులు తెర మీదకి వస్తున్నారు. ప్రగతి నివేదన సభ మాదిరిగానే ఖమ్మం లేదా మహబూబాబాద్‌లో భారీ బహిరంగ సభతో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఆ తర్వాత ప్రచార సభలను కొనసాగించే వీలుంది. ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాతే అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని సీఎం ఇంతకముందే నిర్ణయించారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రచార, సమన్వయ బాధ్యతలు ఎవరెవరికి ఇవ్వాలనే దానిపై కసరత్తు జరుపుతున్నారు. ఈ నెల 13న పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నందున..14 నుంచి ఎంపీలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని కేసీఆర్​ సూచించారు. తమ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలతో కలిసి శాసనసభ సెగ్మెంట్లలో పర్యటించాలని ఆదేశాలు జారీ చేశారు.
undefined

sample description
Last Updated : Feb 11, 2019, 8:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.