డ్రోన్ ద్వారా పురుగుమందుల పిచికారీపై గురువారం రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రదర్శన నిర్వహించారు. ఇక్కడి వరి పరిశోధనా క్షేత్రంలో ‘ సెన్స్‌ఎకర్ ’సంస్థ సహకారంతో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని చేపట్టారు.
జీపీఎస్ సాయంతో...
పది లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకును డ్రోన్‌కు అమర్చి రిమోట్ సహాయంతో జీపీఎస్, జీఐఎస్ పరిజ్ఞానం వినియోగించి వరి పంటపై పిచికారి చేశారు. పంట ఎత్తును బట్టి ఎంత ఎత్తులో డ్రోన్ ద్వారా పిచికారీ చేయాలి, ఎంత మోతాదులో పురుగుమందులు వాడాలి అన్న అంశాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఆర్.జగదీశ్వర్, వరి పరిశోధనా కేంద్రం హెడ్ డాక్టర్ ప్రదీప్, పలువురు శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
డ్రోన్‌తో పిచికారీ - agriculture
సాంకేతికతతో సాగు సులభతరం కానుంది. పరిశోధనలు రైతులకు బాసటగా నిలవనున్నాయి. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రయోగాత్మక ప్రదర్శన అన్నదాతలకు శ్రమను తగ్గించనుంది.