జేఈఈ మెయిన్స్, తెలంగాణ ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం జేఈఈ మెయిన్స్, తెలంగాణ ఐసెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంరెండో విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 7 నుంచి 20 మధ్య నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ.. ఎన్టీఏ ప్రకటించింది. ట్రిపుల్ ఐటీ, ఎన్ఐటీల్లో బీటెక్, బీఆర్క్ ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్షలకు... నేడు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. మార్చి 8 వరకు అవకాశం ఉంది. ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. జేఈఈ మెయిన్స్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన 2 లక్షల 25 వేల మందికి.. ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసే అర్హత ఉంటుంది. ఇటు రాష్ట్రంలో ఈ నెల 21న ఐసెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే 6 వరకు ఉంది. మే 9 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మే 23, 24 తేదీల్లో పరీక్ష ఉంటుంది. మే 29 న ప్రిలిమినరి కీ, జూన్ 13న పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. పరీక్ష కోసం తెలంగాణలో 12, ఏపీలో 4 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.