భార్యకు తెలియకుండా రెండో పెళ్లికి సిద్ధపడిన ఓ ప్రబుద్ధుడిని 'ఫేస్బుక్' పట్టించింది. రంగారెడ్డి జిల్లా అస్పల్లిగూడకు చెందిన నల్లవల్లి కిషోర్ రెడ్డి హైదరాబాద్ దిల్సుఖ్నగర్ నివాసి. ప్రకాశం జిల్లా గంపుమేస్త్రీ కుటుంబం కొన్నేళ్లుగా ఎల్బీనగర్లో స్థిరపడ్డారు. ఈయన కుమార్తె బీటెక్ చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా..2015లో కిషోర్ రెడ్డితో పరిచయమైంది. కొన్ని నెలలకే ఆర్య సమాజ్‌లో పెళ్లికూడా చేసుకున్నారు.అమెరికా వెళ్లే ప్రయత్నం చేయగా కిషోర్ వీసా తిరస్కరణకు గురైంది.
అమెరికా వెళ్లిన కిషోర్ భార్య ప్రతి నెలా రూ.1.50లక్షలు పంపించేది. ఆయన పేరుమీద నాగోల్‌లో ఓ ఫ్లాట్‌ను కోనుగోలు చేసింది. జల్సాలకు అలవాటుపడిన కిషోర్‌కు బెంగుళూరుకు చెందిన మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఈమె కుటుంబంతో మాటలు కలిపి పెళ్లికి ఒప్పించాడు. హైదరాబాద్‌లో పలు వ్యాపారాలు ఉన్నాయని నమ్మించి నిశ్చితార్థం చేసుకున్నాడు. కట్నకానుకుల కింద 10 లక్షల నగదు, కొంత బంగారం కూడా పుచ్చుకున్నాడు. అయితే ఫేస్బుక్లో పెట్టిన నిశ్చితార్థం చిత్రాలు మొదటి భార్య చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిషోర్‌ని కటకటాల్లోకి పంపారు. చెడు పోకడలకు అలవాటుపడిన కిషోర్ రెడ్డికి విడాకులకు సైతం దరఖాస్తు చేసింది.
నిశ్చితార్థంతో ఫేస్'బుక్' - usa
సామాజిక మాధ్యమాలు నేరాలకు అడ్డాగా మారడమే కాదు..నేరస్తుల ఆట కట్టిస్తున్నాయి. భార్య ఉండగానే మరో పెళ్లికి సిద్ధమైన వ్యక్తిని 'ఫేస్బుక్' పట్టించింది. కటకటాల వెనక్కి పంపించింది. ఓ మహిళ జీవితాన్ని కాపాడింది.