ఆదిలాబాద్ పురపాలక సంఘం పరిధిలో కూరగాయల విక్రయానికి అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. వైరస్ వ్యాప్తితో పాటు, రద్దీ దృష్ట్యా పట్టణంలోని రైతు బజార్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 49 వార్డుల్లోని ప్రజలకు అందుబాటులో ఉండేలా తొమ్మిది కూరగాయల విక్రయ కేంద్రాలను ఎంపిక చేశారు.
విక్రయ కేంద్రాల వివరాలు..
జిల్లా పరిషత్ కార్యాలయం, వ్యవసాయ మార్కెట్ యార్డు, ఇందిరా ప్రియదర్శిని కాలనీ, దస్నాపూర్ దసరా మైదానం, మహాలక్ష్మీ వాడ, రణదివే నగర్, ప్రయాణ ప్రాంగణం, కేఆర్కే కాలనీ, అబ్దుల్లా చౌక్ ప్రాంతాల్లో ఇక నుంచి కూరగాయలు విక్రయించనున్నారు. నిత్యవసరాలకు కొరత లేదని, ప్రజలు గుంపులుగా విక్రయ కేంద్రాల వద్దకు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: వలస కూలీలకు వసతులు.. కేసీఆర్‌కు అభినందనల వెల్లువ