ETV Bharat / city

Food Poison: అల్పాహారం వికటించి 43 మంది బాలికలకు అస్వస్థత - students hospitalized

students hospitalized after eating mid day meals in adilabad

author img

By

Published : Mar 9, 2022, 1:12 PM IST

Updated : Mar 9, 2022, 2:29 PM IST

13:07 March 09

Food Poison: అల్పాహారం వికటించి 43 మంది బాలికలకు అస్వస్థత

Food Poison: ఆదిలాబాద్ గ్రామీణ కస్తూర్భా గాంధీ పాఠశాలలో అల్పాహారం వికటించి 43 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని విద్యానగర్ కాలనీలో కస్తూర్భా పాఠశాల కొనసాగుతోంది. ఉదయం అల్పాహరంలో ఇడ్లీ, చట్నీ తిన్న బాలికలు.. కాసేపటికే వరుసగా ఒక్కొక్కరు వాంతులు చేసుకోవటం ప్రారంభించారు. ఈ విషయం కాస్తా బయటికి తెలియటంతో.. మీడియా బృందం పాఠశాలకు చేరుకుంది. అప్పటివరకు బాలికలు పాఠశాలలోనే ఇబ్బంది పడుతూ ఉన్నారు.

ఆ తర్వాతే ఆటోలు, మీడియా వాహనాలపై విద్యార్థులను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీఈవో ప్రణీత ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల పరిస్థితిని డైరెక్టర్ జై సింగ్​ని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని కలెక్టర్ తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

Last Updated : Mar 9, 2022, 2:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.