Pregnant woman Protest in Mancherial : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట... తనకు న్యాయం చేయాలంటూ ఓ గర్భిణీ నిరసనకు దిగింది. ఆదిలాబాద్‌కు చెందిన స్వప్న.. లక్షెట్టిపేట మండలం మోదల గ్రామానికి చెందిన మెట్టుపల్లి శ్రీధర్‌తో పెద్దల సమక్షంలో 2021 నవంబర్ 21న ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం స్వప్న ఆరు నెలల గర్భవతి. ఆమె భర్త శ్రీధర్.. అతడి తల్లిదండ్రుల మాటలను నమ్మి తనను వదిలిపెట్టి పారిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది.
తనకు తల్లిదండ్రులు లేకపోవడం, కులం తక్కువ కావడంతో తనను హింసిస్తున్నారని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని, తనకు న్యాయం చేయాలని స్వప్న వేడుకుంది. స్థానిక ప్రజాప్రతినిధి శ్రీనివాస్ వల్లే... తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు చేసింది. పోలీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగడం తన వల్ల కాదని... తనకు న్యాయం జరిగే వరకు అంబేడ్కర్ విగ్రహం ముందు నిరసన చేస్తానని బాధితురాలు తెలిపింది.