వ్యవసాయానికి అనుబంధంగా పాడిపరిశ్రమ ఉంటేనే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో రోజుకు 20 వేల లీటర్ల చొప్పున సేకరించే లక్ష్యంతో నెలకొల్పిన పాలసేకరణ కేంద్రాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య పాలసేకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. వివిధ ప్రాంతాలనుంచి తీసుకొచ్చిన పాలను, పశుగ్రాసం స్టాళ్లను మంత్రి పరిశీలించారు.
పాలపెత్తనం మొత్తం మహిళలదేనని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. లీటరుకు 66 రూపాయల 50 పైసల చొప్పున పాడిపరిశ్రమ ఇస్తున్న వెసలుబాటును రైతులకు దక్కేలా ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. రాష్ట్ర డెయిరీ ఛైర్మన్ లోకభూమారెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, పాడిపరిశ్రమ శాఖ ముఖ్య కార్యదర్శి అనిత రామచంద్రన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.